News October 27, 2025

ధర్మపురి: మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అరెస్ట్..!

image

సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సవాల్‌ను స్వీకరించిన మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఛాలెంజ్‌లో భాగంగా హైదరాబాద్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న ఆయణ్ను అరెస్ట్ చేసిన పోలీసులు సైఫాబాద్ పోలిస్ స్టేషన్‌కు తరలించారు.

Similar News

News October 27, 2025

త్వరలో SBIలో 3,500 పోస్టుల భర్తీ!

image

వచ్చే 6 నెలల్లో ఎస్బీఐ 3500 ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో 505 పీఓ పోస్టులు ఉన్నట్లు ఎస్బీఐ డిప్యూటీ ఎండీ కిశోర్ కుమార్ వెల్లడించారు. 3వేల సర్కిల్ ఆధారిత అధికారులను నియమించుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రిలిమినరీ, మెయిన్స్, సైకోమెట్రిక్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా పీఓ పోస్టుల భర్తీ జరుగుతుందన్నారు. బ్యాంక్ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు ప్రిపేర్ కావొచ్చు.

News October 27, 2025

వచ్చేనెల సివిల్ సర్వీస్ ఎంప్లాయీస్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు

image

సివిల్ సర్వీస్ ఎంప్లాయీస్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు నవంబర్ 1, 2వ తేదీల్లో స్థానిక రాజీవ్ స్టేడియంలో జరుగనున్నాయని జిల్లా క్రీడా అధికారి ఎస్.వెంకటేశ్వరరావు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోటీలు జరుగుతాయని చెప్పారు. ముందుగా ప్రకటించిన తేదీలు భారీ వర్షాల కారణంగా వాయిదా వేయబడినట్లు వివరించారు. అర్హులైన ఉద్యోగులు గమనించి ఈ పోటీలకు హాజరు కావాలని సూచించారు.

News October 27, 2025

రామగుండం: ఆకట్టుకున్న డాగ్ స్క్వాడ్ ప్రదర్శన

image

రామగుండం కమిషనరేట్‌లో సోమవారం జరిగిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో డాగ్ స్క్వాడ్ ప్రదర్శన విద్యార్థులను ఆకట్టుకుంది. స్నిఫర్ డాగ్స్ ప్రతిభను విద్యార్థులు ఆసక్తిగా వీక్షించారు. ఫింగర్ ప్రింట్ డివైస్‌లు, కమ్యునికేషన్ సిస్టమ్‌లు, బాంబ్ డిస్పోజల్ ఎక్విప్మెంట్, ట్రాఫిక్ సేఫ్టీ పరికరాలు, గంజాయి, డ్రగ్స్ నిరోధక కిట్లతో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ ద్వారా పోలీస్ సిబ్బంది విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు.