News December 31, 2025

ధర్మపురి: ముక్కోటి ఏకాదశి.. నర్సన్న ఆదాయం ఎంతంటే..?

image

ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంగళవారం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉత్తర ద్వార దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ కొనసాగింది. ఈ సందర్భంగా ఆలయానికి టికెట్ల ద్వారా రూ.3,25,974లు, ప్రసాదాల విక్రయాలతో రూ.4,51,200లు, అన్నదానం ద్వారా రూ.75,730ల ఆదాయం లభించింది. మొత్తం ఆదాయం రూ.8,52,904లు సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు.

Similar News

News January 8, 2026

భూపలపల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంపై సమీక్ష

image

జయశంకర్ భూపాలపల్లి కలెక్టరేట్‌లోని గురువారం కలెక్టర్ రాహుల్ శర్మ ఆధ్వర్యంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇందిరమ్మ గృహాల గృహ నిర్మాణాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై ఇందిరమ్మ గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులను సూచించారు. మున్సిపల్, ఎంపిడివోలు, ఇంజనీరింగ్ అధికారులతో మాట్లదారు. అదనపు కలెక్టర్ విజయలక్మి, లోక్ నాయక్ ఉన్నారు.

News January 8, 2026

జిల్లా మలేరియా అధికారిగా నాగార్జున

image

జిల్లా మలేరియా నూతన అధికారిగా నాగార్జున గురువారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆయన జిల్లా వైద్యశాఖ అధికారి విజయమ్మను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అధికారుల ఆదేశాలను పాటిస్తూ తనకు కేటాయించిన లక్ష్యాలను సమర్ధవంతంగా నెరవేరుస్తానని ఆయన అన్నారు. నూతన వైద్యాధికారికి సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

News January 8, 2026

అనంతపురం కోర్టుకు బాంబు బెదిరింపు

image

అనంతపురం జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రత దృష్ట్యా లాయర్లు, సిబ్బందిని వెలుపలికి పంపారు. డీఎస్పీ శ్రీనివాసులు నాయకత్వంలో బాంబు స్క్వాడ్, క్లూస్ టీమ్ కోర్టు ప్రాంగణంలో సుదీర్ఘ తనిఖీలు చేపట్టాయి. ప్రతి గదిని క్షుణ్ణంగా పరిశీలించారు. చివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.