News March 20, 2025

ధర్మపురి: రథోత్సవంలో జేబుదొంగ

image

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి వారి రథోత్సవంలో ఓ జేబుదొంగ పోలీసులకు చిక్కాడు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రథోత్సవం కొనసాగింది. రథాల వద్ద ఉన్న ఓ భక్తుని జేబులో చేయి పెడుతుండగా అక్కడే ఉన్న గొల్లపల్లి ఎస్ఐ సతీష్ గమనించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. వెంటనే సదరు వ్యక్తి జేబును వెతకగా జేబులో నుంచి దాదాపు నాలుగైదు పర్సులు, కొంత నగదు లభించాయి. వెంటనే జేబుదొంగను స్టేషన్ కు తరలించారు.

Similar News

News November 8, 2025

కోడూరు: కూలికి వెళ్లి అనంత లోకాలకు..!

image

వ్యవసాయ కూలి పనుల వెళ్లి విగత జీవిగా యువకుడు కాటికి చేరిన సంఘటన కోడూరు మండలం గొల్లపాలెం గ్రామంలో వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఓలేటి ఇంద్ర బాబు(27), ఇతర వ్యవసాయ కార్మికులతో ఇటీవల చిత్తూరు జిల్లా రేణిగుంట వ్యవసాయ కూలీ పనులకు వెళ్లాడు. శుక్రవారం వ్యవసాయ పనులు చేస్తున్న క్రమంలో కరెంటు షాక్ గురై అక్కడకక్కడే మృతి చెందాడని ఇంద్రబాబు కుటుంబ సభ్యులు తెలిపారు.

News November 8, 2025

రేవంత్, కేసీఆర్‌కు కిషన్ రెడ్డి సవాల్

image

TG: రాష్ట్రంలో <<18226951>>బ్యాడ్ బ్రదర్స్<<>> అంటే రేవంత్, KCR అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి తాను తీసుకొచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా అని వారికి సవాల్ విసిరారు. కేంద్రం ఏం ఇచ్చిందో డాక్యుమెంట్లతో సహా వివరిస్తానని ప్రెస్‌మీట్‌లో పేర్కొన్నారు. ‘రేవంత్‌ది ఫెయిల్యూర్ ప్రభుత్వం. బ్యాడ్ బ్రదర్స్ అవినీతికి పాల్పడ్డారు. రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారు’ అని వ్యాఖ్యానించారు.

News November 8, 2025

MBNR: ‘ఈనెల 13లోగా దరఖాస్తు చేసుకోండి’

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా గ్రామీణ యువత స్వయం ఉపాధి కోసం SBI RSETY ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అందిస్తోంది. ఈ నెల 13 వరకు లేడీస్ టైలరింగ్ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఉచిత భోజనం, వసతి కల్పించనున్నారు. 19 నుంచి 45 సం. వయస్సు గల మహిళలు దరఖాస్తు చేసుకోవాలన్నారు. బండమీదిపల్లిలోని RSETY కేంద్రంలో లేదా 9963369361, 9542430607 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.