News March 4, 2025

ధర్మపురి: రెండు బైకులు ఢీ.. ఒకరు మృతి

image

ధర్మపురి మండలం గాదెపల్లిలో రెండు బైకులు ఢీకొని ఒకరు స్పాట్‌లోనే మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వేగంగా రెండు బైకులు వేగంగా ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఒక వ్యక్తి స్పాట్లోనే మృతి చెందగా మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయన్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 5, 2025

పెంచికల్పేట్: భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్

image

గత రెండు రోజుల క్రితం మండలం లోడుపల్లి గ్రామంలో వివాహిత అనుమానాస్పద మృతి విషయం తెలిసిందే. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు 24 గంటల్లోనే కేసును ఛేదించినట్లుగా సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఈరోజు ఉదయం 10:30 గంటలకు ఎంకపల్లి బస్టాండ్ వద్ద భర్త గణేశ్, అతని తండ్రిని అదుపులోకి తీసుకొని విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించానని చెప్పినట్లు SI కొమురయ్య తెలిపారు.

News March 5, 2025

నిర్మల్: బడులకు ల్యాప్‌టాప్‌లు వచ్చాయ్…!

image

జిల్లాలోని 17 పీఎం శ్రీ పాఠశాలలకు మంజూరైన ల్యాప్‌టాప్‌లను మంగళవారం డీఈవో రామారావు ఉపాధ్యాయులకు అందజేశారు. జిల్లాలో 20 పాఠశాలలు ఎంపిక కాగా 17 పాఠశాలలకు టింకరింగ్ ల్యాబ్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. వీటి కింద 17 పాఠశాలలకు ల్యాప్‌టాప్‌లు, ఇతర పరికరాలు వచ్చాయన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయా పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

News March 5, 2025

యాదాద్రి బ్రహ్మోత్సవాలపై కలెక్టర్ సమావేశం

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలకు వివిధ శాఖల మంత్రులు వస్తున్న సందర్భంగా అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. ఈ సందర్భంగా మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆలయ ఈఓ భాస్కర్ రావు, అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

error: Content is protected !!