News April 7, 2025

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అదివారం రూ.1,77,684 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.82,098 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.87,100, అన్నదానానికి రూ.8,486 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

Similar News

News July 7, 2025

గొంతుకోసి చిన్నారి హత్య.. చిన్నమ్మే హంతకురాలు?

image

TG: జగిత్యాల కోరుట్లలో ఐదేళ్ల చిన్నారి హితీక్ష హత్య కేసు ఊహించని మలుపు తిరిగింది. కుటుంబ తగాదాలతో హితీక్షను చిన్నమ్మే చంపినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. శనివారం పిల్లలతో ఆడుకునేందుకు వెళ్లిన చిన్నారి బాత్రూమ్‌లో శవమై తేలింది. నిన్న చిన్నారి అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబసభ్యులు, స్థానికులు హితీక్షకు కన్నీటి వీడ్కోలు పలికారు.

News July 7, 2025

ఢిల్లీకి బయల్దేరిన సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి బయల్దేరారు. రెండు రోజులపాటు అక్కడే ఉండనున్నారు. పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్‌ ప్రాజెక్టులపై చర్చించనున్నారు. మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టు, RRRకు అనుమతులు, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు నిధులు కోరనున్నారు.

News July 7, 2025

జనగామ: సీనియర్ V/S జూనియర్..!

image

జిల్లాలో రాజకీయాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. స్థానిక ఎన్నికలే లక్ష్యంగా సీనియర్ నాయకులు పావులు కదుపుతున్నారు. కాగా జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ప్రతి పార్టీలో సీనియర్ V/S జూనియర్ రాజకీయాలు నడుస్తున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. రిజర్వేషన్లు తమకు అనుకూలంగా రావాలని వేచి చూస్తున్నారు. అయితే జిల్లాలో యువత రాజకీయాల వైపునకు ఎక్కువ మొగ్గు చూపుతుండటం గమనార్హం.