News April 8, 2025

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం రూ.1,38,094 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.59,833 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.71,195, అన్నదానానికి రూ.7,066 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

Similar News

News November 12, 2025

బిలియనీర్ల అడ్డా ముంబై, ఢిల్లీ!

image

ప్రపంచంలో ఎక్కువ మంది బిలియనీర్లు ఉండే టాప్-10 నగరాల జాబితాలో ముంబై, ఢిల్లీ చోటు దక్కించుకున్నాయి. 119 మంది కుబేరులతో న్యూయార్క్ టాప్‌లో ఉందని హురున్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నివేదిక వెల్లడించింది. ఆ తర్వాత లండన్(97), ముంబై(92), బీజింగ్(91), షాంఘై(87), షెంజెన్(84), హాంకాంగ్(65), మాస్కో(59), ఢిల్లీ(57), శాన్‌ఫ్రాన్సిస్కో(52) ఉన్నాయి.

News November 12, 2025

పెద్దపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

image

ఢిల్లీలో టెర్రరిస్టులు జరిపిన కారు బాంబు దాడిలో మరణించిన భారతీయులకు పెద్దపల్లి ప్రెస్ క్లబ్ ఆద్వర్యంలో కొవ్వొత్తులతో మంగళవారం నివాళి అర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న సీఐ కొండపాక ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. టెర్రరిజం మానవ మనుగడకు పెనుప్రమాదం అన్నారు. క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఉగ్రవాదంపై ప్రభుత్వం ఉక్కు పాదాన్ని మోపాలని పేర్కన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు, తదితరులున్నారు.

News November 12, 2025

కామారెడ్డి: ప్రజావాణి దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

image

సీఎం ప్రజావాణి, జిల్లా ప్రజావాణిలో పెండింగ్‌లోని దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మండల అధికారులను ఆదేశించారు. మంగళవారం తహశీల్దార్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. దరఖాస్తుల పరిష్కారంలో ప్రత్యేక చొరవ చూపాలని, సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజల సమస్యలను పెండింగ్‌లో పెట్టొద్దని గట్టిగా చెప్పారు.