News September 8, 2024
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆదివారం ఆదాయ వివరాలు
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం రూ.39,906 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.13,900, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.21,700, అన్నదానం రూ.3,306 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.
Similar News
News November 26, 2024
భాషతో పాటు భావ వ్యక్తీకరణ ముఖ్యం: కరీంనగర్ కలెక్టర్
విద్యార్థులకు భాషతో పాటు భావ వ్యక్తీకరణపై అవగాహన చాలా ముఖ్యమని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను టి.ఈ.డి “స్టూడెంట్స్ టాక్” కార్యక్రమానికి పంపేందుకు గాను జిల్లా స్థాయిలో ఎంపిక నిర్వహిస్తున్నారు. మండల స్థాయిలో ప్రభుత్వ విద్యార్థుల ఎంపిక కార్యక్రమం మంకమ్మతోటలోని ప్రభుత్వ (దనగర్వాడీ) పాఠశాలలో జరిగింది.
News November 26, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ కరీంనగర్ ప్రజావాణికి 193 ఫిర్యాదులు. @ జగిత్యాల కలెక్టరేట్ ఎదుట ఏఎన్ఎంల నిరసన. @ రాజన్న సిరిసిల్ల జిల్లాలో బాలికను వేధించిన ఆరుగురికి జైలు శిక్ష. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ కోరుట్ల పట్టణంలో తాళం వేసిన ఇంట్లో చోరీ. @ జగిత్యాల జిల్లాలో ఇద్దరు పాఠశాల ఫుడ్ ఇన్చార్జిల సస్పెండ్. @ మల్లాపూర్ మండలంలో శివాలయం నిర్మాణానికి శంకుస్థాపన.
News November 25, 2024
పెద్దపల్లి: 1200 ఏళ్ల నాటి శివాలయం!
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్లో శ్రీ సాంబ సదాశివ ఆలయం ప్రాచీన కాలం నాటిది. ఈ ఆలయాన్ని కాకతీయుల కాలంలో 16 స్తంభాలతో నిర్మించారు. దాదాపు ఈ గుడికి 1200 ఏళ్ల చరిత్ర ఉందని చరిత్రకారుల అంచనా. గుడి వెనక భాగంలో కొలను ఉంది. అందులో నూరు చిన్న కొలనులు ఉన్నాయని అందుకే ఈ గ్రామానికి కొలనూరు అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. ప్రస్తుతం ఈ ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి.