News October 17, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ.63,569 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.34,600, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.21,760, అన్నదానం రూ.7,209 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు.

Similar News

News November 24, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లా దీక్ష దివాస్ ఇన్‌ఛార్జ్‌లు వీరే

image

ఈ నెల 29న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దీక్ష దివాస్ నిర్వహించనున్నట్లు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. దీక్ష దివాస్ నిర్వహణకు సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌ఛార్జ్‌లను నియమించారు. కరీంనగర్ జిల్లాకు MLC బండ ప్రకాశ్, సిరిసిల్ల జిల్లాకు మాజీ MP వినోద్ కుమార్, పెద్దపల్లి జిల్లాకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల జిల్లాకు మాజీ MLC MD. సలీంను నియమించినట్లు ఆయన తెలిపారు.

News November 24, 2024

వేములవాడ: రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం సెలవు కార్తీక మాసం పురస్కరించుకొని భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలతో పాటు అనుబంధ ఆలయాల్లో సైతం భక్తులు ఉదయం నుంచే కోనేటిలో పుణ్యస్నానం ఆచరించి క్యూ ద్వారా స్వామివారిని దర్శించుకుంటున్నారు. అనంతరం భక్తులు కార్తిక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు.

News November 24, 2024

దీక్షా దివాస్‌ ఉమ్మడి KNR జిల్లాల ఇన్‌ఛార్జులు వీరే

image

TG రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించాలని BRS శ్రేణులకు మాజీ మంత్రి, సిరిసిల్ల MLA కేటీఆర్ పిలుపునిచ్చారు. నవంబర్ 29న రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్‌ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించాలన్నారు. దీక్షా దివాస్‌కు ఉమ్మడి జిల్లాలో
KNR-ప్రకాశ్ ముదిరాజ్ MLC,
SRCL-బోయినపల్లి వినోద్,
PDPL-కొప్పుల ఈశ్వర్,
JGTL-సలీం(MLC)ను ఇన్‌ఛార్జులుగా నియమించారు.