News October 19, 2024
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శుక్రవారం రూ.88,305 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.50,416, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.28,230, అన్నదానం రూ.9,659,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
Similar News
News November 24, 2024
వేములవాడ: రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం సెలవు కార్తీక మాసం పురస్కరించుకొని భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలతో పాటు అనుబంధ ఆలయాల్లో సైతం భక్తులు ఉదయం నుంచే కోనేటిలో పుణ్యస్నానం ఆచరించి క్యూ ద్వారా స్వామివారిని దర్శించుకుంటున్నారు. అనంతరం భక్తులు కార్తిక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు.
News November 24, 2024
దీక్షా దివాస్ ఉమ్మడి KNR జిల్లాల ఇన్‌ఛార్జులు వీరే
TG రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించాలని BRS శ్రేణులకు మాజీ మంత్రి, సిరిసిల్ల MLA కేటీఆర్ పిలుపునిచ్చారు. నవంబర్ 29న రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించాలన్నారు. దీక్షా దివాస్‌కు ఉమ్మడి జిల్లాలో
KNR-ప్రకాశ్ ముదిరాజ్ MLC,
SRCL-బోయినపల్లి వినోద్,
PDPL-కొప్పుల ఈశ్వర్,
JGTL-సలీం(MLC)ను ఇన్‌ఛార్జులుగా నియమించారు.
News November 24, 2024
వివరాలు ఫోన్ ద్వారా సేకరించాలి: ఉప ముఖ్యమంత్రి భట్టి
డోర్ లాక్, వలస వెళ్లిన వారి వివరాలు ఫోన్ ద్వారా సేకరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదివారం కలెక్టర్‌తో మాట్లాడారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చివరికి దశకు చేరుకుందని, సర్వే డాటా ఎంట్రీ చాలా కీలకమైనదని, ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వవద్దని ఆయన స్పష్టం చేశారు.