News November 19, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మంగళవారం రూ.2,64,514 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాల టికెట్ల అమ్మకం ద్వారా రూ.1,87,294, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.60,850, అన్నదానం రూ.16,370 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

Similar News

News February 21, 2026

KNR: టీజీవో డైరీని ఆవిష్కరించిన కలెక్టర్‌ పమేలా సత్పతి

image

తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా డైరీ-2026ను కలెక్టర్ పమేలా సత్పతి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీజీవో జిల్లా అధ్యక్షుడు కాళిచరణ్ ఆధ్వర్యంలో గెజిటెడ్ ఉద్యోగులు కలెక్టర్‌ను శాలువాతో సత్కరించారు. అసోసియేషన్ రూపొందించిన ఈ డైరీలో ఉద్యోగులకు అవసరమైన సమాచారం పొందుపరచడం అభినందనీయమని కలెక్టర్ తెలిపారు. ఇది విధుల్లో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

News February 21, 2026

KNR. రేపే గురుకుల ప్రవేశ పరీక్ష.. ఏర్పాట్లు పూర్తి!

image

కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాల కోసం రేపు (ఫిబ్రవరి 22) ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 5వ తరగతితో పాటు, 6 నుంచి 9 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ పరీక్ష జరుగుతుందని జిల్లా సమన్వయకర్త లక్ష్మి తెలిపారు. ఉదయం11 గంటల నుంచి మధ్యాహ్నం గంట వరకు పరీక్ష ఉంటుందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 12 కేంద్రాల్లో మొత్తం 3787 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నట్లు తెలిపారు.

News February 20, 2026

TGRSA కరీంనగర్ డైరీని ఆవిష్కరించిన అదనపు కలెక్టర్

image

తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కరీంనగర్ డైరీని అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖ ఉద్యోగులు ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు. శాఖ చరిత్ర, ముఖ్య సమాచారం, ఉపయోగకరమైన వివరాలతో డైరీని రూపొందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు, జిల్లా రెవెన్యూ ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు.