News December 17, 2024
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం రూ.1,47,496 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.71,780, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.62,200, అన్నదానం రూ.13,516,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.
Similar News
News February 5, 2025
రామడుగు: పోలీస్ స్టేషన్లో తీన్మార్ మల్లన్నపై ఫిర్యాదు
తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ గత కొద్ది రోజుల క్రితం రెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బుధవారం రామడుగు మండలంలోని గోపాల్ రావు పేట వీరాంజనేయ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ రెడ్డి, రెడ్డి సంఘం సభ్యులు పాల్గొన్నారు.
News February 5, 2025
జగిత్యాల: శ్వేత యాక్సిడెంట్ ఘటన.. అమ్మ కోసం 100 కిలోమీటర్లు!
చిల్వకోడూరు వద్ద నిన్న కారు, బైక్ను ఢీకొన్న ఘటనలో SIశ్వేతతోపాటు <<15356623>>బ్యాంకు ఉద్యోగి నరేశ్(28)<<>> చనిపోయిన విషయం తెలిసిందే. కాగా నరేశ్ది నిరుపేద కుటుంబం. అతడి అన్న ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లగా అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మకు తోడుగా నరేశ్ ఉండేందుకు నిత్యం సుమారు 100కిలోమీటర్లు బైక్పై ప్రయాణిస్తున్నారు.రోజులానే విధులకు వెళ్లిన కొడుకు విగతజీవిగా రావడంతో ఆ తల్లి బోరున విలపించడం స్థానికులను కంటతడి పెట్టించింది.
News February 5, 2025
సిరిసిల్ల: సీఎం నోట ‘KTR ఆత్మహత్య’.. మీ కామెంట్?
అసెంబ్లీలో కాంగ్రెస్, BRS మధ్య రాజకీయం వేడెక్కింది. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయని కొందరు మాట్లాడుతున్నారని, అలాంటివేమీ రావని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘KTR ఏమైనా ఆత్మహత్య చేసుకుంటారా.. సిరిసిల్లకు ఉపఎన్నిక రావడానికి?’ అని అన్నారు. ఉప ఎన్నికలు వస్తాయని KTR చేస్తున్న వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాము ఎన్నికల కోసం కులగణన చేయలేదని, ప్రజల అభివృద్ధి కోసమే చేశామని స్పష్టం చేశారు.