News January 1, 2025
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు
జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మంగళవారం రూ.1,06,018 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్ల అమ్మకం ద్వారా రూ.73,514, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.22,490, అన్నదానం రూ.10,014 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.
Similar News
News January 4, 2025
బ్యాడ్మింటన్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడిగా శ్రీధర్ బాబు
బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడిగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికను బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు పుల్లెల గోపిచంద్ శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. అనంతరం అధ్యక్షుడిగా ఎన్నికైన మంత్రి శ్రీధర్ బాబును సచివాలయంలో ఘనంగా సన్మానించారు.
News January 4, 2025
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సావిత్రిబాయి పూలే జయంతి. @ వేములవాడ బీసీ సంక్షేమ హాస్టల్ ను తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్. @ మెట్పల్లి ఆర్డీవో కార్యాలయాన్ని తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్. @ ముత్తారం మండలంలో పురుగుల మందు తాగి విద్యార్థి ఆత్మహత్యాయత్నం. @ జగిత్యాలలో కొండచిలువను రక్షించిన అటవీశాఖ అధికారులు. @ కోరుట్ల పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం.
News January 3, 2025
సిరిసిల్ల: ఖేల్ రత్న, అర్జున అవార్డుల గ్రహీతలకు కేటీఆర్ విషెస్
ఖేల్ రత్న, అర్జున అవార్డులకు ఎంపికైన క్రీడాకారులకు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అభినందనలు తెలిపారు. తెలంగాణ బిడ్డ పారా అథ్లెట్ దీప్తి జివాంజి, ఏపీకి చెందిన అథ్లెట్ జ్యోతి యర్రాజి.. అర్జున అవార్డులకు ఎంపికై తెలుగు రాష్ట్రాల ఖ్యాతిని దేశం దశదిశలా వ్యాపింపజేసినందుకు మీకు శుభాకాంక్షలు అంటూ ఎక్స్ లో రాసుకొచ్చారు. మరెన్నో శిఖరాలను అధిరోహించాలని కోరారు.