News March 9, 2025
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం రూ.2,68,080 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,23,314 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.99,330, అన్నదానానికి రూ.45,436 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.
Similar News
News December 14, 2025
ఏకాగ్రతకు చిహ్నం ‘కుంకుమ’

కుంకుమను పసుపు, సున్నపు రాయి కలిపి తయారుచేస్తారు. అయితే ఇప్పుడు ఆ ప్రక్రియ చాలావరకు మారిపోయింది. రసాయనాలు వాడుతున్నారు. అలా తయారైన కుంకుమనే మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. అయితే అసలైన కుంకుమ ధరించడం ఎంతో ముఖ్యమని చెబుతున్నారు పండితులు. కనుబొమ్మల నడుమ కుంకుమధారన మనలో ఏకాగ్రతను పెంచుతుందని అంటున్నారు. కుదిరితే ఇంట్లోనే కుంకుమ తయారు చేసుకోవాలని సూచిస్తున్నారు.
News December 14, 2025
మరికాసేపట్లో..

TG: ఇవాళ ఉదయం 7 గంటల నుంచి రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. 415 GPలు ఏకగ్రీవం కాగా మిగిలిన 3,911 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం 38,350 పోలింగ్ సెంటర్లను ఈసీ ఏర్పాటు చేసింది. మొత్తం 57,22,665 మంది ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగనుండగా 2 గంటలకు లెక్కింపు ప్రక్రియ మొదలు కానుంది. అనంతరం ఫలితాలు వెలువడనున్నాయి.
News December 14, 2025
కుంకుమను ఇంట్లోనే తయారు చేసుకోండిలా..

మార్కెట్‌లో దొరికే నకిలీ కుంకుమతో చర్మ సమస్యలు రావొచ్చు. అయితే ఇంట్లోనే సహజంగా కుంకుమను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం పసుపు, సున్నం ఉంటే చాలు. ముందుగా ఆర్గానిక్ పసుపు తీసుకోవాలి. అందులో చిటికెడు సున్నం వేయాలి. ఆ తర్వాత నాలుగైదు చుక్కల నీళ్లు పోసి బాగా కలపాలి. సున్నం వేయడం వల్ల ఆ మిశ్రమం ఎరుపు రంగులోకి మారుతుంది. ఈ మిశ్రమాన్ని ఎండలో ఆరబెడితే పొడిగా మారి, నాణ్యమైన కుంకుమ తయారవుతుంది.


