News March 14, 2025
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ.5,11,031 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్ల అమ్మకం ద్వారా రూ.1,85,465, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.2,80,500, అన్నదానానికి రూ.45,066 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.
Similar News
News December 19, 2025
కడప జిల్లా కానిస్టేబుల్ అభ్యర్థులకు గమనిక

కడప జిల్లా కానిస్టేబుల్ అభ్యర్థులు(సివిల్) శిక్షణకు హాజరు కావాలని SP విశ్వనాథ్ ఆదేశించారు. ‘పురుషులకు తిరుపతి కళ్యాణి డ్యాం, మహిళలకు ఒంగోలు PTCలో ఈనెల 21 నుంచి ట్రైనింగ్ ఉంటుంది. ఒరిజినల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు, SBI పాస్‌బుక్ జిరాక్స్, రూ.10వేల కాషన్ డిపాజిట్, పోలీస్ డిపార్ట్‌మెంట్ సర్వీస్ బుక్, 6స్టాంప్ సైజ్ ఫోటోలు, రూ.100 అగ్రిమెంట్ బాండ్‌తో ఎస్పీ ఆఫీసుకు 21వ తేదీ రావాలి’ అని SP చెప్పారు.
News December 19, 2025
HYD: రైలు ప్రయాణికులకు GOOD NEWS

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. కాకినాడ-వికారాబాద్, సికింద్రాబాద్–కాకినాడ, తిరుపతి–VKB, నర్సాపూర్–వికారాబాద్, లింగంపల్లి–నర్సాపూర్, లింగంపల్లి–కాకినాడ, వికారాబాద్–కాకినాడ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. రైళ్లకు బుకింగ్ ప్రారంభమైందని అధికారులు తెలిపారు. ఇప్పటికే 1.5% బుకింగ్ పూర్తి అయిందన్నారు.
News December 19, 2025
దివ్యాంగులకు త్రీవీలర్స్, ట్రాన్స్‌జెండర్లకు రేషన్‌కార్డులు: డోలా

AP: దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి కల్పనకు ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి డోలా వీరాంజనేయస్వామి చెప్పారు. 21 సెంచరీ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ద్వారా పోటీ పరీక్షలతోపాటు డిజిటల్, కమ్యూనికేషన్ స్కిల్స్‌పై ట్రైనింగ్ అందిస్తామన్నారు. దివ్యాంగులకు ఫ్రీగా త్రీవీలర్స్ ఇస్తామని చెప్పారు. ట్రాన్స్‌జెండర్లకు పెన్షన్లు, రేషన్ కార్డుల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.


