News March 28, 2025
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ.1,63,699 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాల టికెట్ల అమ్మకం ద్వారా రూ.1,08,012, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.44,880, అన్నదానానికి రూ.10,807 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.
Similar News
News March 2, 2026
సిరిసిల్ల: 72 గంటలు విధులు బహిష్కరించనున్న సెస్ ఉద్యోగులు

పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈనెల 11వ తేదీ ఉదయం 6 గంటల నుండి 72 గంటల పాటు విధులు బహిష్కరించనున్నట్లు సెస్ ఉద్యోగులు తెలిపారు. ఈ మేరకు సెస్ ఎండీ బిక్షపతికి వారు వినతిపత్రం అందజేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యుల ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేయాలని, ఎఫ్‌టీఏ చెల్లించాలని ఉద్యోగుల సంఘం నాయకులు అనిల్ కుమార్, మల్లేశం డిమాండ్ చేశారు.
News March 2, 2026
MDK: ప్రశాంతంగా, కుటుంబ సమేతంగా హోలీ జరుపుకోవాలి: ఎస్పీ

హోలీ పండగ సందర్భంగా మెదక్ జిల్లా ప్రజలకు ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సమేతంగా ప్రశాంత వాతావరణంలో పండగ జరుపుకోవాలని కోరారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, చెరువులు–కుంటాల వద్ద ప్రమాదాలకు గురికావద్దని హెచ్చరించారు. మహిళల పట్ల గౌరవంగా ప్రవర్తించాలని సూచించారు. అల్లర్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పిల్లలపై తల్లిదండ్రులు పర్యవేక్షణ వహించాలని తెలిపారు.
News March 2, 2026
అనకాపల్లి: ఇంటర్ పరీక్షకు 383 మంది గైర్హాజరు

అనకాపల్లి జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షకు 383 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు డీఐఈఓ వినోద్ బాబు తెలిపారు. మొత్తం 9,375 మంది హాజరు కావలసి ఉండగా 8,992 మంది హాజరైనట్లు వెల్లడించారు. పరీక్షలు ప్రశాంతంగా పగడ్బందీగా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. ఎటువంటి మాస్ కాపీయింగ్ కు అవకాశం లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు.


