News March 31, 2025

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి నిత్య ఆదాయం.. ఎంతంటే..?

image

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అదివారం రూ.2,22,450 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు, టికెట్లు అమ్మకం ద్వారా రూ.91,300, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.1,06,250, అన్నదానం ద్వారా రూ.24,900లు వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ఓ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.

Similar News

News September 16, 2025

అంకుడు కర్ర పెంపకానికి చర్యలు: అనకాపల్లి కలెక్టర్

image

మంగళగిరిలో రెండో రోజు జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో కలెక్టరు విజయ కృష్ణన్ మాట్లాడుతూ.. ఏటికొప్పాక లక్క బొమ్మల తయారీకి అవసరమైన అంకుడు కర్రను జిరాయితీ భూముల్లో పెంపకమునకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో NREGS నిధుల ద్వారా చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం షెడ్లకు అనుమతులు ఇవ్వాలని సీఎంను కోరారు. సీఎం చంద్రబాబు అంకుడు కర్ర పెంపకం కోసం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

News September 16, 2025

పెళ్లిపై మరోసారి స్పందించిన జాన్వీ కపూర్

image

తన పెళ్లిపై స్టార్ హీరోయిన్ జాన్వీ మరోసారి స్పందించారు. ‘సన్నీ సంస్కారి కీ తులసి కుమారి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆమెకు పెళ్లిపై ప్రశ్న ఎదురైంది. ‘ప్రస్తుతం నాకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. నా ఫోకస్ అంతా సినిమాలపైనే ఉంది. వివాహానికి ఇంకా చాలా సమయం ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో జాన్వీ డేటింగ్‌లో ఉన్నట్లు టాక్.

News September 16, 2025

చిత్తూరు DCMS ఛైర్మన్ మృతి

image

చిత్తూరు డీసీఎం ఛైర్మన్, టీడీపీ చంద్రగిరి మండల అధ్యక్షుడు పల్లిమేమి సుబ్రహ్మణ్యం నాయుడు మంగళవారం తెల్లవారుజామున మృతిచెందారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నెల రోజులుగా చికిత్స పొందుతున్నారు. కోలుకోలేక తుది శ్వాస విడిచారు. ఆయన మృతికి పలువురు టీడీపీ నాయకులు సంతాపం తెలిపారు.