News July 14, 2024

ధర్మల్ ఉద్యమ అమరుల 14వ సంస్మరణ సభ

image

పర్యావరణ పరిరక్షణకు ప్రజలే నాయకులై ముందుండి నడిపించిన సోంపేట ధర్మల్ పోరాటం దేశంలోనే ప్రజా ఉద్యమాల్లో ఒకటిగా పేరుపొందింది. కార్పొరేట్ల ధనదాహానికి పచ్చని బీల ప్రాంతం కనుమరుగు కావడమే కాకుండా పరిసర ప్రాంత ప్రజల జీవనం అస్తవ్యస్తమవుతుందన్న భయాందోళన నేపథ్యంలో ప్రజలే ముందుండి విజయవంతం చేసిన ఉద్యమంగా సోంపేట ధర్మల్ ఉద్యమం ఖ్యాతికెక్కింది. ధర్మల్ పోరాటంలో మృతుల జ్ఞాపకార్థం జులై 14న ఏటా సభను నిర్వహిస్తారు.

Similar News

News October 7, 2024

ఎచ్చెర్ల: రైల్వే లైన్ ఏర్పాటు చేయాలి: ఎంపీ

image

విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను ఒడిశా రాష్ట్రాన్ని కలుపుతూ నూతన రైల్వే లైన్ ఏర్పాటుకై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఎచ్చెర్ల నాయకులు, VZM ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం సౌత్ రీజియన్‌లో ఉన్న రైల్వే సమస్యలను ఆయన వద్ద ప్రస్తావించారు. ఎంపీతో పాటుగా
కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ ఉన్నారు.

News October 7, 2024

శ్రీకాకుళం-విశాఖ మధ్య ప్రత్యేక రైలు

image

దసరా రద్దీ, విజయనగరం సిరిమాను ఉత్సవం సందర్భంగా ప్రయాణికుల సౌకర్యం కోసం ఈనెల 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు విశాఖ-శ్రీకాకుళం ప్రత్యేక రైలు నడపనున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు సోమవారం తెలిపారు. 10 నుంచి16వ తేదీ వరకు విశాఖలో ఉదయం 10 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.30కి శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) చేరుకుంటుందని, మధ్యాహ్నం 1.30 గంటలకు శ్రీకాకుళంలో బయలుదేరి 4 గంటలకు విశాఖ చేరుకుంటుందని తెలిపారు.

News October 7, 2024

శ్రీకాకుళం: 129 అర్జీలు స్వీకరించిన కలెక్టర్

image

జిల్లా అధికారులు హాజరు తప్పనిసరిగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికను సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అర్జీదారుల నుంచి 129 అర్జీలు స్వీకరించమన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్జీలు పరిష్కారంలో అలసత్వం వహించరాదని సూచించారు. ఎప్పటి అర్జీలు అప్పుడే పరిష్కరించాలని ఆదేశించారు. బాధ్యతగా పనిచేయాలన్నారు.