News February 23, 2025
ధర్మవరంలో కిలో చికెన్ రూ.140

బర్డ్ ఫ్లూ భయంతో చికెన్‌కు డిమాండ్ తగ్గింది. ఎక్కువ మంది నాటుకోడి, మటన్ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ధర్మవరంలో ఇవాళ కిలో చికెన్ రూ.140-160 పలుకుతోంది. నాటుకోడి కిలో రూ.350-400, మటన్ కిలో రూ.700-800లతో విక్రయాలు సాగుతున్నాయి. జిల్లాలోని అన్ని మండలాల్లో దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
Similar News
News November 18, 2025
‘VSP STEEL’ ప్రైవేటీకరణకు CBN కుట్ర: రజిని

AP: కేంద్రంతో కుమ్మక్కై విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించే కుట్రలకు CBN తెరలేపారని మాజీ మంత్రి రజిని ఆరోపించారు. వైట్ ఎలిఫెంట్ అన్న ఆయన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. NDAలో భాగం కాకున్నా జగన్ తన హయాంలో ప్రైవేటుపరం కాకుండా ఆపారని, కానీ ఇప్పుడు కేంద్రం TDP సపోర్టుతో నడుస్తున్నా ఆ దిశగా కదులుతోందని పేర్కొన్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఇప్పుడు బాబు ప్లాంటుకు వెన్నుపోటు పొడుస్తున్నారని దుయ్యబట్టారు.
News November 18, 2025
ఏపీ అప్డేట్స్

* రాష్ట్రంలో ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే రైతులకు డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రి నాదెండ్ల.. ఇప్పటికే రూ.560 కోట్లు ఖాతాల్లో జమ చేశామని ప్రకటన
* రాష్ట్రవ్యాప్తంగా వెల్ఫేర్ హాస్టళ్లలో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు రూ.6.22 కోట్లు మంజూరు.. గురుకుల హాస్టళ్లు, స్టడీ సర్కిళ్లకు రూ.3.06 కోట్లు
* పరకామణి చోరీ ఘటనపై తిరిగి కేసు నమోదు చేయాలని TTD పాలక మండలి సమావేశంలో నిర్ణయం
News November 18, 2025
శంషాబాద్ నుంచి సౌదీకి ప్రత్యేక విమానం

సౌదీ అరేబియాలో జరిగిన ప్రమాద ఘటన బాధితుల కోసం ప్రభుత్వం శంషాబాద్ నుంచి సౌదీకి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన వారిని గుర్తించి, అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మృతుల రక్త సంబంధికులను ఈరోజు రాత్రి 8.30 గంటలకు నాంపల్లి హజ్ హౌస్ నుంచి సౌదీకి పంపనున్నారు.


