News November 26, 2025
ధర్మవరం పట్టు వస్త్రంపై అయోధ్య రాముడు

ధర్మవరం పట్టణానికి చెందిన పట్టు చీరల వ్యాపారి జింకా రామాంజనేయులు, అయోధ్య రాముడిపై భక్తితో ప్రత్యేక వస్త్రాన్ని తయారు చేయించారు. అయోధ్య ఆలయ గర్భగుడిలో ఉన్న రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి చిత్రాలను పట్టు వస్త్రంపై నేయించారు. నెల రోజుల క్రితమే ఆలయ కమిటీకి అందజేయగా, నిన్న ధ్వజారోహణ సందర్భంగా అయోధ్యలో ప్రదర్శించినట్లు ఆయన తెలిపారు.
Similar News
News November 26, 2025
వరంగల్: రైతన్నకు స్వల్ప ఊరట.. పెరిగిన పత్తి ధర

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి రైతులకు నేడు స్వల్ప ఊరట లభించింది. గత రెండు రోజులతో పోలిస్తే నేడు పత్తి ధర పెరిగింది. సోమవారం, మంగళవారం క్వింటా పత్తి ధర రూ.6,880 పలకగా.. ఈరోజు రూ.6,925కి చేరింది. దీంతో రైతన్నకు స్వల్పంగా ఊరట లభించగా.. ధర మరింత పెరగాలని అన్నదాతలు ఆకాంక్షిస్తున్నారు.
News November 26, 2025
అనంతగిరి: ముగ్గురిని బలిగొన్న పడవ

అనంతగిరి మండలం జీనబాడు రేవు వద్ద రైవాడ జలాశయంలో ఆదివారం జరిగిన పడవ బోల్తా ఘటనలో గల్లంతైన మరో యువకుడు దబారి రమేశ్ మృతదేహం బుధవారం లభ్యమైంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మూడు రోజులుగా గాలింపులు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశాయి. దీంతో ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులు జలాశయం వద్ద కన్నీటి పర్యంతమయ్యారు.
News November 26, 2025
వీటిని వంటగదిలో పెడుతున్నారా?

కిచెన్‌లో గ్యాస్ లీక్, కుక్కర్లు పేలడం, షార్ట్ సర్క్యూట్ ఇలా ఎప్పుడు ఏ ముప్పు ముంచుకొస్తుందో తెలియదు. కిచెన్‌లోనే ఫ్రిడ్జ్, ఓవెన్ ఉంటే ప్రమాద తీవ్రత ఎక్కువ. ఇలా కాకుండా ఉండాలంటే వీటిని వెంటిలేషన్ ఎక్కువగా వచ్చే ప్రాంతంలో పెట్టాలి. అలాగే ఒవెన్, ఫ్రిడ్జ్, గ్యాస్ స్టవ్ దూరంగా ఉంచాలి. ఓవర్ లోడింగ్, విద్యుత్ హెచ్చుతగ్గులు, పాతవస్తువులు ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.


