News March 19, 2024
ధర్మారం: చేపల వేటకు వెళ్లి యువకుడి మృతి

చేపల వేటకు వెళ్లి ఓ యువకుడు మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో చోటుచేసుకుంది. SI సత్యనారాయణ వివరాల ప్రకారం.. కొత్తూరుకు చెందిన నర్సింగం.. సాగల నారాయణ పొలంలోని వ్యవసాయ బావిలో చేపలు పట్టుకునేందుకు దిగాడు. అందులోని ఓ తీగ ప్రమాదవశాత్తు అతడి చేతులకు చుట్టుకుని బావిలో నడుము భాగం వరకు మునిగిపోయి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
Similar News
News August 16, 2025
రామకృష్ణ కాలనీలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

తిమ్మాపూర్ మండలం వ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. రామకృష్ణ కాలనీ గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు కృష్ణుడు, రాధ, గోపికల వేషధారణలతో అలరించారు. ఉట్టి కొడుతూ చిన్నారులు సంబరపడ్డారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పంటలు బాగా పండాలని కోరుకుంటూ కృష్ణుడికి పూజలు చేశారు. కార్యక్రమంలో యాద సంఘం నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
News August 15, 2025
తిమ్మాపూర్: కానిస్టేబుల్ నరేష్‌కు ఉత్తమ సేవా పురస్కారం

తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న నరేష్ ఉత్తమ సేవా పురస్కారం అందుకున్నారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా KNR పోలీస్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన వేడుకల్లో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న నరేష్‌ను కలెక్టర్ ప్రమేలా సత్పత్తి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అభినందించారు.
News August 15, 2025
కరీంనగర్: ‘ఉద్యోగుల కృషి దేశ ప్రగతికి పునాది’

కరీంనగర్‌లోని జిల్లా సహకార అధికారి కార్యాలయంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా సహకార అధికారి ఎస్.రామానుజాచార్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల కృషి దేశ ప్రగతికి పునాది అని పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగి అంకితభావంతో పనిచేస్తే సమగ్ర అభివృద్ధి సాధ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో సహకార శాఖ అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.