News November 7, 2025
ధర్మారం: దొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్

ధర్మారం కటికెనపల్లికి చెందిన బోనగిరి వెంకటేశం ఇంట్లో జరిగిన చోరీ కేసులో గడమల్ల సదన్ కుమార్(19)ను అరెస్ట్ చేసినట్లు SI ప్రవీణ్ తెలిపారు. వెంకటేశం OCT 25న ఇంటికి తాళం వేసి వెళ్లాడు. బుధవారం ఇంటికొచ్చే సరికి చోరీ జరిగిందని గుర్తించి PSలో ఫిర్యాదు చేశాడు. విచారణలో సదన్ చోరీ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. బంగారు, వెండి నగలు, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకొని నిందితుడిని రిమాండ్ చేసినట్లు SI చెప్పారు.
Similar News
News November 7, 2025
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో ఉద్యోగాలు

తిరుపతిలోని <
News November 7, 2025
భీమవరం: క్యాన్సర్ అవగాహన దినోత్సవ ర్యాలీ

ముందస్తు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల ద్వారా వ్యాధిని నూరు శాతం నిరోధించవచ్చని కలెక్టర్ నాగరాణి అన్నారు. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం భీమవరం ప్రకాశం చౌక్‌లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. క్యాన్సర్ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించినట్లయితే, వ్యాధి నుంచి కోలుకునే అవకాశం గణనీయంగా పెరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్యే రామాంజనేయులు, ఎస్పీ నయీం అస్మీ పాల్గొన్నారు.
News November 7, 2025
ఇల్లందు ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడి

రహదారుల మరమ్మతులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ నాయకులు ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. జిల్లాలోని రోడ్లను అభివృద్ధి చేయాలని నాయకుడు రాజేందర్ డిమాండ్ చేశారు. వాహనాలపై పన్నులు పెంచి వసూలు చేస్తున్న ప్రభుత్వం రోడ్ల మరమ్మతులు చేయడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా రోడ్లపై తట్టెడు మట్టి కూడా పోయలేదని విమర్శించారు.


