News December 13, 2025
ధర్మారం: పోలీసులు అప్రమత్తంగా ఉండాలి: డీసీపీ

ధర్మారం మండలంలో జరగనున్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని పెద్దపల్లి డీసీపీ బి.రామ్ రెడ్డి సూచించారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని, సమస్యలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News December 18, 2025
అక్రమంగా వైద్య సేవలు అందిస్తున్న ఇద్దరిపై కేసు: కేశవపట్నం ఎస్ఐ

శంకరపట్నం మండలంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా వైద్య సేవలు అందిస్తున్న ఇద్దరు వ్యక్తులపై తెలంగాణ మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ యాక్టివ్ నేషనల్ మెడికల్ మిషన్ ఆక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు కేశవపట్నం ఎస్సై కట్కూరి శేఖర్ రెడ్డి గురువారం తెలిపారు. అనుమతులు లేకుండా వైద్య సేవలు అందిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. కేశవపట్నం గ్రామంలో అంజయ్య, ప్రభాకర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.
News December 18, 2025
MBNR: 19న “FSSAI లైసెన్స్,రిజిస్ట్రేషన్ మేళా”

మహబూబ్‌నగర్ జిల్లాలోని ఆహార వ్యాపార నిర్వాహకుల (ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు) కోసం ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ(FSSAI) లైసెన్స్ ,రిజిస్ట్రేషన్ మేళా ఈనెల 19న నిర్వహించనున్నట్లు జిల్లా ఆహార తనిఖీ అధికారి నీలిమ తెలిపారు. ఈ మేళా మహబూబ్ నగర్ నందు ఇంటిగ్రేటెడ్ జిల్లా కార్యాలయ సముదాయం(IDOC) గది నెం.218లో ఉదయం 11.00 గంటల నుంచి నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వివరాలకు 81212 59373, 70134 83730 నంబర్లకు సంప్రదించాలన్నారు.
News December 18, 2025
ఉమ్మడి జిల్లాలో ఈనాటి ముఖ్య వార్తలు

✒విశాఖ ఎక్స్‌ప్రెస్‌ను పొడిగించాలి:ఎంపీ డీకే అరుణ
✒MBNR: సర్పంచ్ ఎన్నికలు.. రూ.11,08,250 సీజ్:SP
✒సర్పంచుల మరణాలకు బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణం:MLA అనిరుధ్ రెడ్డి
✒MBNR: రేపు అంబులెన్స్ డ్రైవర్ల నియామకానికి ఇంటర్వ్యూలు
✒T-20 క్రికెట్ లీగ్.. జట్ల ఎంపికలు పూర్తి
✒పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్
✒పంచాయితీ పోరులో కాంగ్రెస్ హవా
✒MBNR: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్


