News March 26, 2025

ధర్మారం: మద్యానికి బానిసై యువకుడి సూసైడ్

image

మద్యానికి బానిసై యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన ధర్మారం మండలం కొత్తూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. గ్రామానికి చెందిన నవీన్ (29) మద్యానికి బాగా బానిసయ్యాడు. దీంతో అతడి భార్య తనను వదిలివెళ్లిపోయింది. జీవితంపై విరక్తి చెంది పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. మృతుడి తమ్ముడు ప్రవీణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

Similar News

News March 29, 2025

మంచిర్యాల: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

మంచిర్యాలలోని ఏసీసీ అంబేడ్కర్ బొమ్మ సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఎస్ఐ కిరణ్ కుమార్ వివరాలు.. మృతురాలి వయస్సు 55 నుంచి 60 సంవత్సరాలు ఉంటుందని, ఎరుపు రంగు జాకెట్, గులాబి రంగు చీర ధరించి ఉందన్నారు. ప్రస్తుతం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపరిచినట్లు వెల్లడించారు. వివరాలు తెలిసిన వారు స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్ఐ సూచించారు.

News March 29, 2025

భూపాలపల్లి: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ

image

భూపాలపల్లి జిల్లా ప్రజలకు ఎస్పీ కిరణ్ ఖారె ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉగాది కొత్త సంవత్సరానికి ఆరంభసూచిక అని అన్నారు. ఈ శుభ సందర్భంలో ప్రతి కుటుంబానికి ఆనందం, ఆరోగ్యం, శాంతి కలగాలని కోరుకుంటున్నానన్నారు. అలాగే ప్రజలు శాంతి, భద్రతలను పాటిస్తూ ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకోవాలని సూచించారు.

News March 29, 2025

మెట్రో రైలు ప్రయాణ వేళలు పొడిగింపు

image

HYD మెట్రో రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఉదయం 6 – రాత్రి 11.45 వరకు సర్వీసులు ఉంటాయని మెట్రో వెల్లడించింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ టైమింగ్స్ అమలు చేస్తామని చెప్పింది. అలాగే టెర్మినల్ స్టేషన్‌ల నుంచి ఆదివారాల్లో మొదటి రైలు ఉ.7 గంటలకు ప్రారంభం అవుతుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం మెట్రో రైలు సర్వీసులు ఉ.6 నుంచి రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉంటున్న విషయం తెలిసిందే.

error: Content is protected !!