News December 27, 2025

ధర్మారం: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. ధర్మారం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన తోడేటి సాయి(తండ్రి స్వామి) శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. జూలపల్లి మండలంలోని పెద్దాపూర్, తేలుకుంట రెండు గ్రామాల శివారులో రాత్రి ద్విచక్రవాహనం అదుపుతప్పి మృతి చెందినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 30, 2025

KMR: ‘ఎగిరే గాలిపటం.. తీయొద్దు ప్రాణం’

image

సంక్రాంతి పండుగ వేళ గాలిపటాలు ఎగురవేసే ఉత్సాహం ఇతరుల ప్రాణాల మీదకు రాకూడదని KMR ఎస్పీ రాజేష్ చంద్ర ప్రజలను కోరారు. గత సంక్రాంతి సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో చైనా మాంజా విక్రయిస్తున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో 65 బెండల చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. చైనా మాంజా విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.

News December 30, 2025

మేడారంలోనే ఎస్పీ కేకన్ అడ్డా

image

మేడారం జాతరలోనే జిల్లా అధికారులు మకాం పెట్టారు. ములుగు ఎస్పీ రాంనాథ్ కేకన్ స్వయంగా మేడారంలోనే తన క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో ఎస్పీ, ఓఎస్డీ శివం ఉపాధ్యాయ, డీఎస్పీ రవీందర్, సీఐ దయాకర్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. రోడ్ల మరమ్మతు జరుగుతుండటంతో రాత్రి సమయంలో ప్రమాదాలు జరగకుండా పోలీసులు గస్తీ ముమ్మరం చేశారు. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నా, వణుకుతూనే పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

News December 30, 2025

చిత్తూరులో భారీ స్కాం.. ఆ లైసెన్సులు రద్దు!

image

దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన చిత్తూరు జిల్లా GST స్కాంలో జిల్లాకు చెందిన ఏడు పరిశ్రమల లైసెన్సులు రద్దయినట్లు తెలుస్తోంది. వీటిలో హరి ఓం ట్రేడర్స్, హేమ స్టీల్స్, సంతోష్ కాంట్రాక్ట్ వర్క్స్, సాయి కృష్ణ కాంట్రాక్ట్ వర్క్స్, పెద్ద మస్తాన్ ఎంటర్ప్రైజెస్ ఉన్నట్లు సమాచారం. GST స్కాంపై అధికారులు గుట్టుచప్పుడు కాకుండా లోతైన దర్యాప్తు చేస్తున్నారు. దీంతో ఈ జాబితాలోకి మరికొన్ని సంస్థలు చేరనున్నాయి.