News December 16, 2025

ధర్మారం: సర్పంచ్‌గా బాలింత..!

image

ధర్మారం మండలం బుచ్చయ్యపల్లిలో నేరెళ్ల వంశిక 239 ఓట్లతో సర్పంచ్‌గా విజయం సాధించారు. 4 ఏళ్ల క్రితం ఈమెకు వివాహం కాగా, 11 రోజుల క్రితమే కుమార్తెకు జన్మనిచ్చారు. గ్రామస్థుల సూచనతో, కాంగ్రెస్ మద్దతుతో నామినేషన్ వేసిన వంశిక మొన్న జరిగిన ఎన్నికల్లో గెలుపొందారు. 4 రోజుల క్రితం వరకు ఆసుపత్రిలో ఉన్న ఆమె, పోలింగ్ కేంద్రానికి వచ్చి ధ్రువీకరణ పత్రం స్వీకరించారు. గ్రామస్థులు వంశికకు అభినందనలు చెప్పారు.

Similar News

News December 16, 2025

ఐబొమ్మ రవికి మరోసారి పోలీస్ కస్టడీ

image

పైరసీ వ్యవహారంలో అరెస్టైన ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు రవిని నాంపల్లి జిల్లా కోర్టు మరోసారి పోలీస్ కస్టడీకి అప్పగించింది. 3 కేసుల్లో విచారణ కోసం 12 రోజులకు అనుమతించింది. ఒక్కో కేసులో 4 రోజుల చొప్పున ప్రశ్నించాలని పోలీసులకు సూచించింది. దీంతో ఎల్లుండి నుంచి సైబర్ క్రైమ్ పోలీసులు రవిని విచారించనున్నారు. ప్రస్తుతం రవి చంచల్‌గూడ జైలులో ఉన్నాడు.

News December 16, 2025

వనపర్తి: 81 గ్రామపంచాయతీలకు మూడో విడత ఎన్నికలు

image

వనపర్తి జిల్లా పరిధిలోని 87 గ్రామపంచాయతీలలో 6 ఏకగ్రీవమయ్యాయి.81 గ్రామపంచాయతీలో మూడో విడత ఎన్నికలు జరగనున్నాయని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1300 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించామని ఆమె పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పూర్తి రక్షణ 163 BNSS అమలులో ఉంటుందని, ప్రశాంత ఎన్నికల కోసం పోలీసులు తమ విధులు నిర్వహిస్తున్నారని ఎస్పీ పేర్కొన్నారు.

News December 16, 2025

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఖమ్మం సీపీ

image

మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సింగరేణి మండలంలోని పలు క్రిటికల్ పోలింగ్ స్టేషన్లను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మంగళవారం సందర్శించారు. ముందుగా కారేపల్లిలో గల పోలింగ్ కేంద్రంలో బందోబస్త్ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా ప్రతిఒక్కరు సమన్వయం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.