News August 25, 2025

ధర్మారం: TGRS పూర్వ విద్యార్థికి కవితా పురస్కారం

image

ధర్మారం మండలం నంది మేడారం TGRS&JC పూర్వ విద్యార్థి (SSC 2010-11) చిందం రమేష్ ఆదివారం ఖమ్మంలో ‘వురిమల్ల పద్మజ స్మారక జాతీయ కవితా పురస్కారం’ అందుకున్నారు. ఆయన రాసిన ‘విషాద కావ్యం’ కవితకు గాను జాతీయస్థాయిలో ఈ పురస్కారం లభించింది. కాగా జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం గొడిసెలపేట గ్రామానికి చెందిన రమేష్ అదే మండలంలోని రాంనూరు గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు.

Similar News

News August 25, 2025

KMR: వరల్డ్ ఐకాన్ అవార్డ్ అందుకున్న డా.రవీంద్ర మోహన్

image

ఎల్లారెడ్డి, పిట్లం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఇన్‌ఛార్జ్ మెడికల్ సూపరింటెండెంట్ రవీంద్ర మోహన్ ‘మోస్ట్ కంపాషినెట్ సర్జన్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం అందుకున్నారు. దిల్లీలో జరిగిన ‘వరల్డ్ ఐకాన్ అవార్డ్స్’ వేడుకలో ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, ఎరిట్రియన్ అంబాసిడర్ అలెమ్ త్సేహాయ్ వోల్డెమరియమ్, ట్రేడ్ కమిషనర్ డాక్టర్ సెనోరిటా ఐజాక్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు.

News August 25, 2025

‘వినాయక చవితి’ ట్రెండ్ మారింది

image

గణేశ్ నిమజ్జనం రోజు చూసే వేడుకలు ఇప్పుడు వినాయకుడి ఆగమనం రోజున కనిపిస్తున్నాయి. విగ్రహాలను కొనుగోలు కేంద్రాల నుంచి తీసుకొస్తున్న సమయంలోనూ యువత సెలబ్రేట్ చేసుకుంటున్నారు. డీజే మ్యూజిక్, ఫైర్ వర్క్స్, రంగులు చల్లుకుంటూ బొజ్జ గణపయ్యకు ఆహ్వానం పలుకుతున్నారు. నగరాలకే పరిమితమైన ఈ కల్చర్ గ్రామాలకు విస్తరిస్తోంది. ఏమైనప్పటికీ విద్యుత్ వైర్ల కింద నుంచి, రహదారులపై వెళ్తున్న సమయంలో జాగ్రత్తగా వ్యవహరించండి.

News August 25, 2025

రాష్ట్రస్థాయి విజేతగా ఉమ్మడి వరంగల్ జట్టు

image

యువత క్రీడల్లో రాణించాలని బాల్ బ్యాడ్మింటన్ కొమురం భీం జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ అన్నారు. రెబ్బెన మండలం గోలేటి టౌన్‌షిప్‌లో పురుషులు, మహిళల బాల్ బ్యాడ్మింటన్ రాష్ట్రస్థాయి పోటీలు ఆదివారం ముగిశాయి. పురుషుల విభాగంలో ఉమ్మడి వరంగల్ విజేతగా, రంగారెడ్డి రన్నరప్‌గా నిలిచాయి. మహిళల విభాగంలో ఆదిలాబాద్ విజేతగా, వరంగల్ రన్నరప్‌గా నిలిచి బహుమతులు అందుకున్నాయి.