News November 27, 2025

ధర్మేంద్ర మృతిపై హేమా మాలిని భావోద్వేగ పోస్ట్

image

ప్రముఖ నటుడు ధర్మేంద్ర మృతి తర్వాత ఆయన భార్య హేమామాలిని SMలో తొలి పోస్టు చేశారు. ఆయన మృతితో తన జీవితం శూన్యమైందని భావోద్వేగానికి గురయ్యారు. ధర్మేంద్ర తనకు భర్త మాత్రమే కాకుండా.. స్నేహితుడు, మార్గదర్శి అని చెప్పారు. కుమార్తెలు ఈషా, అహానాపై ఆయన చూపిన ప్రేమను గుర్తుచేసుకున్నారు. ధర్మేంద్ర వినయం ఆయనను ఐకాన్‌గా నిలబెట్టిందని తెలిపారు. ఆయన మరణంతో ఏర్పడిన ఖాళీ జీవితాంతం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News November 27, 2025

NRPT: కంట్రోల్ రూమ్, మీడియా సెంటర్‌ను పరిశీలించిన పరిశీలకురాలు

image

గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రత్యేక శ్రద్ధతో పని చేయాలని నారాయణపేట జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు ఎ.సీతాలక్ష్మి అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌కు వచ్చిన ఆమె మీడియా సెంటర్, కంట్రోల్ రూమ్‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ఆమెకు స్వాగతం పలికారు.

News November 27, 2025

ధాన్యం కొనుగోళ్లపై వైసీపీ అబద్ధాలు: నాదెండ్ల

image

AP: రైతులకు నష్టం లేకుండా ధాన్యం కొంటున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 24 గంటల్లోనే ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని చెప్పారు. అయినా YCP నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ₹1,674 కోట్లు బకాయిలు పెట్టి పారిపోయిన వాళ్లా రైతుల పక్షాన మాట్లాడేదని మండిపడ్డారు. 8.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. దళారులను నమ్మి రైతులు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దని కోరారు.

News November 27, 2025

పాక్ న్యూక్లియర్ కంట్రోల్స్ ఆసిమ్ మునీర్ చేతికి!

image

పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ఆ దేశ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్‌(CDF)గా బాధ్యతలు చేపట్టారు. అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌కు అతను అధిపతిగా ఉంటారు. ఆ దేశ ప్రధానికి సరిసమానమైన పవర్స్ మాత్రమే కాదు లీగల్ ప్రొటెక్షన్ కూడా ఆసిమ్ మునీర్‌కు ఉంటుందని చెబుతున్నారు. అతనికి కేసుల నుంచి లైఫ్ టైమ్ ఇమ్యూనిటీతో పాటు న్యూక్లియర్ వెపన్స్ కంట్రోల్స్ కూడా అతని చేతికే ఇస్తారని తెలుస్తోంది.