News September 22, 2025
ధర్వేశిపురం ఎల్లమ్మ తల్లి దివ్య దర్శనం

కనగల్ మండలం ధర్వేశిపురంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో సోమవారం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి మాట్లాడుతూ.. అక్టోబర్ 2 వరకు 11 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అధికారి అంబటి నాగిరెడ్డి, ఛైర్మన్ వెంకటరెడ్డి పాల్గొన్నారు.
Similar News
News September 22, 2025
VJA: అమ్మవారి దర్శనానికి ఫోన్లతో భక్తుల రాక

కనకదుర్గమ్మ దర్శనానికి వస్తున్న భక్తులు యథేచ్చగా ఫోన్లను తీసుకొచ్చేస్తున్నారు. క్యూలైన్లలో దర్జాగా వాడేస్తున్నారు. కొండ కిందే సెల్‌ఫోన్లను భద్రపరుచుకోవాలి, పైకి తీసుకురాకుండా కట్టడి చేస్తామని అధికారులు గతంలో చెప్పారు. ఉత్సవాలు ప్రారంభమైన తొలిరోజే ఫోన్ల కట్టడిలో అధికారులు విఫలమైనట్లు తెలుస్తోంది. ఫోన్లను అనుమతిస్తే.. అమ్మవారి ఫోటోలు, వీడియోలు రికార్డు చేసే అవకాశం ఉంటుందని పలువురు హెచ్చరిస్తున్నారు.
News September 22, 2025
JGTL: దసరా బొనాంజా పేరుతో వింత ఆఫర్లు

జగిత్యాల జిల్లాలో దసరా పండుగ సందర్భంగా ‘దసరా బొనాంజా’ పేరుతో కొందరు యువకులు రూ.150కే మేక, బీర్లు, విస్కీ, కోళ్లు, చీర వంటి బహుమతులు ప్రకటించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ ఆఫర్లకు సంబంధించిన ఫ్లెక్సీలు వైరల్‌గా మారాయి. స్థానికంగా సాయిని తిరుపతి అనే వ్యక్తి ఈ బంపర్ డ్రాను నిర్వహిస్తున్నట్లు సమాచారం. OCT 1న డ్రా తీయనున్నారని ప్రచారం జరుగుతుండటంతో ప్రజలు టోకెన్లకు ఎగబడుతున్నారు.
News September 22, 2025
తాండూరులో గర్భిణీ మృతి

తాండూరు ప్రభుత్వ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. కొడంగల్ నియోజకవర్గం రావులపల్లి గ్రామానికి చెందిన అఖిల(21) రెండవ కాన్పు కోసం ఆసుపత్రిలో చేరి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న యాలాల పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.