News March 20, 2025

ధవలేశ్వరం: హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు

image

రూరల్‌లోని 2019లో ధవలేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో కోర్టు ముద్దాయికి జీవిత ఖైదు, 5 వేల జరిమానా విధించింది. బుధవారం రాజమండ్రి కోర్టులో వాద ప్రతి వాదనలు విన్న తర్వాత జడ్జి విజయ్ గౌతమ్ ముద్దాయి దాడి గణేష్‌కు జీవిత ఖైదు విధించారు. భార్యపై అనుమానంతో దాడిచేసి చంపినట్లు రుజువైందని పీపీ లక్ష్మణ్ నాయక్ తెలిపారు. ధవలేశ్వరం సీఐ గణేష్, హెచ్సీ జయ రామరాజు ముద్దాయిని కోర్టులో హాజరు పరిచారు.

Similar News

News August 17, 2025

యథావిధిగా పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెల నిర్వహించే పీజీఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కారం) కార్యక్రమం ఈ నెల 18 సోమవారం యథావిధిగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. ప్రజలు తమ అర్జీలను డివిజన్, మండల కేంద్రాల కార్యాలయాల్లోనే అందజేయవచ్చని ఆమె పేర్కొన్నారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.

News August 16, 2025

తూ.గో: విలీన మండలాలకూ ఫ్రీ బస్సులు వర్తిస్తాయి: డీపీటీఓ

image

పోలవరం విలీన మండలాలైన వీఆర్ పురం, కూనవరం, ఎటపాక, చింతూరు ప్రాంతాల్లోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వర్తిస్తుందని తూ.గో. జిల్లా ఆర్టీసీ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ (డీపీటీఓ) వై.ఎస్.ఎన్. మూర్తి స్పష్టం చేశారు. అంతర్‌రాష్ట్ర సర్వీసులు మినహా మిగిలిన అన్ని బస్సుల్లోనూ ఈ పథకం అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. ఆయా ప్రాంతాల మహిళల అభ్యంతరాలపై ఆయన ఈ వివరణ ఇచ్చారు.

News August 16, 2025

తూ. గో: ఘాట్ రోడ్లలోనూ ఉచిత బస్సులు

image

రాష్ట్రంలోని ఘాట్ రోడ్లలో కూడా మహిళలు ఇక ఉచితంగా ప్రయాణించవచ్చని తూ.గో ఆర్టీసీ డీపీటీఓ వై.సత్యనారాయణ మూర్తి తెలిపారు. భద్రతా కారణాల వల్ల మొదట నిలిపివేసినప్పటికీ, తాజాగా ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించాలంటూ ఆదేశాలు ఇచ్చిందన్నారు. రాజమండ్రి-భద్రాచలం, శ్రీశైలం వంటి మార్గాల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని తెలిపారు.