News August 21, 2024

ధవళేశ్వరం: సముద్రంలోకి 2.92 లక్షల క్యూసెక్కుల నీరు

image

రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి మంగళవారం 2.92లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశామని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. తూర్పు డెల్టా, మధ్య డెల్టా, పశ్చిమ డెల్టా కాలవలకు 14,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామన్నారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 10.90 అడుగుల నీటిమట్టం ఉందని చెప్పారు.

Similar News

News August 23, 2025

యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలి: కలెక్టర్

image

రైతులు అవసరానికి మించి యూరియాను వాడకుండా విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ పి.ప్రశాంతి వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం రాజమండ్రి కలెక్టరేట్‌లో యూరియా వినియోగంపై అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు 18,588 మెట్రిక్ టన్నుల యూరియాను పంపిణీ చేశామని వెల్లడించారు. ఇంకా 2,405 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

News August 23, 2025

రాజమండ్రి: దోమల నియంత్రణకు డ్రోన్ టెక్నాలజీ

image

రాజమండ్రిలో ప్రజల ఆరోగ్య పరిరక్షణ, పర్యావరణ శుద్ధి లక్ష్యంగా స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కలెక్టర్ పి.ప్రశాంతి ప్రారంభించారు. ఇందులో భాగంగా కంబాల చెరువు పార్కులో దోమల నివారణకు డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించారు. డ్రోన్లతో మందులు పిచికారీ చేయడంతోపాటు, దోమల లార్వాలను తినే గాంబూసియా చేపలను చెరువులో వదిలారు. ఈ వినూత్న కార్యక్రమం పట్ల ఎమ్మెల్సీ హర్షం వ్యక్తం చేశారు.

News August 23, 2025

దేవరపల్లి: లారీ ఢీకొని సర్పంచ్ బుల్లారావు మృతి

image

దేవరపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సదర మండలం రామన్నపాలెం సర్పంచ్ కూచిపూడి బుల్లారావు మృతి చెందారు. ఆయన ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బుల్లారావు అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.