News September 27, 2025
ధవళేశ్వరం: 11.30 అడుగులకు చేరిన నీటిట్టం

ధవళేశ్వరం సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి నీటిమట్టం మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువైంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పెరగడంతో శనివారం మధ్యాహ్నం 1 గంటకు నీటిమట్టం 11.30 అడుగులకు చేరింది. అధికారులు బ్యారేజీలోని 175 గేట్లు ఎత్తి 9.13 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అలాగే మూడు ప్రధాన పంట కాలువల ద్వారా 10,700 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేస్తున్నారు.
Similar News
News September 27, 2025
‘ఖాదీ సంత’ విజయవంతానికి బీజేపీ సన్నాహక సమావేశం

గాంధీ జయంతిని పురస్కరించుకుని రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో నిర్వహించనున్న “ఖాదీ సంత” కార్యక్రమంపై బీజేపీ శనివారం సన్నాహక సమావేశం నిర్వహించింది. రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగింది. ఖాదీ సంత విజయవంతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై పలువురు సూచనలు చేశారు. ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నాయకులు తీర్మానించారు.
News September 27, 2025
GST ప్రయోజనాలపై అవగాహన కల్పించండి: జేసీ

GST సంస్కరణల మేలును క్షేత్రస్థాయి ప్రజలకు చేర్చడానికి విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని జేసీ, జిల్లా GST నోడల్ అధికారి వై.మేఘ స్వరూప్ తెలిపారు. శనివారం రాజమండ్రి కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ‘సూపర్ GST – సూపర్ సేవింగ్స్’ పేరిట నెల రోజులపాటు ఈ ప్రచారాన్ని నిర్వహించాలని వై.మేఘ స్వరూప్ వెల్లడించారు.
News September 27, 2025
ధవళేశ్వరం బ్యారేజ్‌ను పరిశీలించిన కలెక్టర్

ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి బ్యారేజీని పరిశీలించారు. నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉండడంతో, చేపట్టాల్సిన ముందస్తు చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో ఆమె చర్చించారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.