News July 27, 2024

ధవళేశ్వరం: 12.49 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి

image

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద శనివారం ఉదయం 7 గంటల వరకు 13.60 అడుగులతో గోదావరి నీటిమట్టం నిలకడగా ఉందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ నుంచి 12.49 లక్షల క్యూసెక్కుల నీరు సముద్ర జలాల్లోకి వదులుతున్నారు. మూడు పంట కాలువల ద్వారా 5900 క్యూసెక్కుల నీటిని పంట సాగుకు విడుదల చేస్తున్నారు.

Similar News

News February 27, 2026

తూ.గో: కల్తీ పాల ఘటనపై హెల్త్ బులెటిన్ విడుదల

image

కల్తీ పాల ఘటనలో రాజమండ్రిలోని వివిధ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్న 15 మందిలో 11 మంది బాధితుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ మేరకు శుక్రవారం రాత్రి వైద్య ఆరోగ్యశాఖ తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. నలుగురు రోగుల పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు వెల్లడించింది. కాగా 11 మంది రోగులకు ఇప్పటికీ వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటికే ఈ ఘటనలో 5గురు మృతి చెందిన సంగతి తెలిసిందే.

News February 27, 2026

తూ.గో: టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. రేపే లాస్ట్!

image

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు-2026కు హాజరయ్యే విద్యార్థుల నామినల్ రోల్స్‌లో తప్పుల సవరణకు ప్రభుత్వం ప్రత్యేక అవకాశం కల్పించినట్లు DEO కె.వాసుదేవరావు తెలిపారు. విద్యార్థుల పేరు, పుట్టిన తేదీ, తదితర వివరాల్లో మార్పులు ఉంటే ఈనెల 28లోపు ఆన్‌లైన్‌లో సవరించుకోవాలని సూచించారు. ఇదేచివరి అవకాశమని, విద్యాసంస్థలు అప్రమత్తంగా ఉండి గడువులోగా ప్రక్రియ పూర్తి చేయాలని శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు.

News February 27, 2026

పెన్షన్‌దారులకు శుభవార్త.. ఒకరోజు ముందుగానే ‘సామాజిక భరోసా’

image

మార్చి నెల ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు ఒకరోజు ముందుగానే అందజేయనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. సాధారణంగా ప్రతి నెలా ఒకటో తారీఖున పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. అయితే, ఈసారి మార్చి 1వ తేదీ ఆదివారం కావడంతో, లబ్ధిదారుల సౌకర్యార్థం ఫిబ్రవరి 28వ తేదీ(శనివారం) నాడే పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు ఆమె శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.