News November 10, 2024
ధాన్యం అమ్మాలంటే కష్ట పడాల్సిందే..!
భూమి చదును చేసి, నారు మడులు సిద్ధం చేసుకొని, నాటు వేసి.. పంట చేతికొచ్చి.. విక్రయించి చేతికి డబ్బులు వచ్చే దాక రైతుకు అన్ని కష్టాలే. కొన్ని చోట్ల ముందస్తు వరి కోతలు షురూ కాగా..మరి కొన్ని చోట్ల కోతలు పూర్తయ్యాయి. పంట నూర్పిడి చేసిన ధాన్యాన్ని రోడ్ల పై ఎండ బెట్టారు. ధాన్యంలో తేమశాతం తగ్గేలా ఓ రైతు ధాన్యాన్ని తిరగేస్తున్న దృశ్యాన్ని ‘WAY2NEWS’ పిట్లంలో హై వే-161 వద్ద తన కెమెరాలో బంధించింది.
Similar News
News November 12, 2024
మహారాష్ట్రలోనే అత్యధిక రైతు ఆత్మహత్యలు: షబ్బీర్ అలీ
దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలోనే అన్నదాతల ఆత్మహత్యలు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని మరిచిపోయాయని ఫైర్ అయ్యారు. మహారాష్ట్రలో బీజేపీ అసత్య ప్రచారం చేస్తుందన్నారు. తెలంగాణలో ఇచ్చిన మాట ప్రకారం గ్యారంటీలను కాంగ్రెస్ అమలు చేస్తోందని చెప్పుకొచ్చారు.
News November 12, 2024
పరీక్ష కేంద్రాలకు ముందుగానే రావాలి: NZB కలెక్టర్
ఆర్మూర్ మార్గంలో అడవి మామిడిపల్లి వద్ద ఆర్‌యూబీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 17, 18 తేదీల్లో గ్రూప్ -3 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నిర్ణీత సమయం కంటే ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ఆర్‌యుూబీ పనులు జరుగుతున్నందున నవంబర్ 10 నుంచి డిసెంబర్ 10 వరకు నిజామాబాద్ – ఆర్మూర్ మార్గంలో రాకపోకలు మళ్లించామన్నారు.
News November 12, 2024
బిక్కనూర్: ఇద్దరు ఉపాధ్యాయులు సస్పెండ్
బిక్కనూర్ మండలం కాచాపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసినట్లు మండల విద్యాధికారి రాజా గంగారెడ్డి తెలిపారు. పాఠశాలలో మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు శ్రీనివాస్, అతనికి సహకరించిన ప్రధానోపాధ్యాయుడు కాంత్ రెడ్డిని జిల్లా విద్యాశాఖ అధికారి రాజు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.