News March 21, 2025

ధాన్యం కొనుగోలుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్

image

రబీ సీజన్లో ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోలుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో 2024-25 రబీ ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ప్రస్తుత అంచనా ప్రకారం రబీ సీజన్ కు సంబంధించి 1,85,000 మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం, 73,000 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం, మొత్తం 2,58,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయబోతున్నామన్నారు.

Similar News

News March 21, 2025

ఎంపీ వద్దిరాజుకు రాష్ట్రపతి ముర్ము ఆహ్వానం

image

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు తదితర ఎంపీలతో కలిసి రాష్ట్రపతి భవన్‌లో శుక్రవారం ఉదయం అల్పాహారం తీసుకున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న సందర్భంగా ఆనవాయితీ ప్రకారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభల సభ్యులను ఆహ్వానించి అల్పాహార విందునిచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర రాజ్యసభలో తన సహచర ఎంపీలతో పాటు రాష్ట్రపతి ముర్మును కలిసి పలు అంశాలపై మాట్లాడారు.

News March 21, 2025

ఖమ్మంలో జోనల్ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు

image

ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో జోనల్ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య తెలిపారు. పౌర సేవలను ప్రజలకు మరింతగా అందించేందుకు నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ జోనల్ కార్యాలయ ఏర్పాటుకు శుక్రవారం మున్సిపల్ అధికారులతో కలిసి కమిషనర్ అనువైన భవనాలను పరిశీలించారు. ఆయా భవనాల్లో కార్యాలయాలను ఏర్పాటుచేసి సేవలను ప్రారంభించాలని అధికారులకు సూచించారు.

News March 21, 2025

భద్రాద్రి: భార్య మందలించిందని.. భర్త ఆత్మహత్య

image

భార్య మందలించిందని భర్త ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లి మండలంలోని జగ్గుతండాలో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ రతీష్ వివరాలిలా.. జగ్గుతండాకు చెందిన అజ్మీరా మోహన్(47) మద్యానికి బానిసై, తరచూ మద్యం తాగి ఇంటికి వస్తుండడంతో భార్య మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన భర్త ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిపారు. కేసు నమోద చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

error: Content is protected !!