News September 25, 2025

ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు రావద్దు: అదనపు కలెక్టర్

image

ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. బుధవారం ఐడీఓసీలో ఖరీఫ్ సీజన్ 2025-26 ధాన్యం కొనుగోలు సంసిద్ధతపై వివిధ శాఖల విభాగాలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని, అన్ని విభాగాలు సమన్వయంతో పని చేసి, రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

Similar News

News September 25, 2025

5 ఇసుక డిసిల్టేషన్ పాయింట్లకు అనుమతులు జారీ: కలెక్టర్

image

జిల్లాలో అదనంగా 5 ఇసుక డిసిల్టేషన్ పాయింట్లకు అనుమతులు జారీ చేసినట్లు కలెక్టర్ సిరి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. సీ బెలగల్ మండలంలోని కొత్తకోట, సింగవరం, ఈర్లదిన్నె, ముడుమాల, పల్లదొడ్డి గ్రామాల్లో ఇసుక లోడింగ్‌కు అనుమతులు ఇచ్చామన్నారు. వినియోగదారుల కోసం జిల్లాలో 12 లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉందన్నారు.

News September 25, 2025

పశువుల్లో రేబీస్ వ్యాధి లక్షణాలు- నివారణ

image

రేబీస్ వ్యాధి సోకిన పశువుల్లో జ్వరం వస్తుంది. తర్వాత కేంద్రనాడీ వ్యవస్థ దెబ్బతినడం వల్ల పశువులు అసాధారణంగా ప్రవర్తిస్తాయి. కండరాలలోని నరాలు దెబ్బతినడం వల్ల పక్షవాతం సోకుతుంది. మేతను మింగలేకపోవడం, నీటిని చూసి భయపడటం, అధిక లాలాజలం స్రవించడం, బలహీనత, ఎక్కువగా అరవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పశువులను కుక్క కరిస్తే సాధ్యమైనంత త్వరగా వెటర్నరీ డాక్టరు సూచనలతో యాంటీరేబీస్ టీకా వేయించాలి.

News September 25, 2025

Mega Dsc: నేడు నియామక పత్రాల అందజేత

image

AP: మెగా డీఎస్సీలో ఎంపికైన 15,941 మందికి ఇవాళ కూటమి ప్రభుత్వం నియామక పత్రాలు అందజేయనుంది. 150 రోజుల్లోనే మెగా డీఎస్సీ ప్రక్రియను పూర్తి చేసినట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. అమరావతిలో జరిగే ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు హాజరుకానున్నారు. ఇప్పటికే కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం పోస్టుల్లో 7,955 మంది మహిళలు ఉండటం గమనార్హం.