News March 30, 2025

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి: అదనపు కలెక్టర్

image

సంగారెడ్డి జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ మాధురి అన్నారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 216 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో అదనపు ఎస్పీ సంజీవరావు, సివిల్ సప్లై డీఎం అంబాదాస్ రాజేశ్వర్ పాల్గొన్నారు.

Similar News

News February 23, 2026

MBNR: సౌత్ జోన్.. పీయూలో చెస్ ఎంపికలు

image

పీయూలో సౌత్ జోన్ టోర్నీలో పాల్గొనేందుకు చెస్ (పురుషుల) ఎంపికలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వీసీ జీఎన్ శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. యూనివర్సిటీలో అన్ని సదుపాయాలు ఉన్నాయని, క్రీడాకారులు ప్రతిభ చాటి యూనివర్సిటీకి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. రిజిస్ట్రార్ పూస రమేశ్ బాబు, పీడీ డా.వై.శ్రీనివాసులు, కోచ్‌లు పాల్గొన్నారు. ఎంపికైన వారు మార్చి 1న నుంచి తమిళనాడులో జరిగే టోర్నీలో పాల్గొననున్నారు.

News February 23, 2026

NZB: లైసెన్స్‌‌డ్ సర్వేయర్లకు సర్టిఫికెట్లు అందజేత

image

విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న 46 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లకు NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం కలెక్టరేట్‌లో సర్టిఫికెట్లను అందజేశారు. కలెక్టర్ వారికి పలు సూచనలు చేశారు. లైసెన్స్‌డ్ సర్వేయర్లు బాధ్యతాయుతంగా సేవలు అందించాలని సూచించారు. ఎలాంటి అవినీతి ఆరోపణలకు తావు లేకుండా నిజాయతీగా సర్వే నివేదికలు అందజేశాయన్నారు.

News February 23, 2026

విశాఖ: లారీ ఢీకొని మహిళ దుర్మరణం

image

విశాఖ పరిధి బీహెచ్‌పీవీ జంక్షన్లో రోడ్డు దాటుతున్న మహిళను లారీ ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. సోమవారం మధ్యాహ్నం సబ్బవరం (M) ఆరిపాకకు చెందిన ఈశ్వరమ్మ(45) చెప్పులు కొనుగోలు చేసుకునేందుకు బీహెచ్‌పీవీ వద్ద ఓ దుకాణానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో భారీ టిప్పర్ లారీ ఢీకొంది. దీంతో ఆమె తల నుజ్జుయింది. గాజువాక ట్రాఫిక్ పోలీసులు చేరుకొని లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.