News April 8, 2025
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి: అడిషనల్ కలెక్టర్

రబీ సీజన్‌ను పురస్కరించుకొని కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సంబంధిత అధికారులతో అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ధాన్యం రాకను బట్టి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చర్యలు తీసుకోవాలని తహాశీల్దార్లను ఆదేశించారు. ప్రతి కేంద్రం పూర్తి స్థాయిలో పనిచేసే వరకు రెవెన్యూ వ్యవసాయ శాఖ, సివిల్ సప్లైఅధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు.
Similar News
News April 8, 2025
TRADE WAR: ట్రంప్ వార్నింగ్‌ను లెక్కచేయని చైనా

US ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్స్‌కు ప్రతీకారంగా చైనా కూడా 34% సుంకాలు విధించిన విషయం తెలిసిందే. దీనిపై ట్రంప్ స్పందిస్తూ రేపటిలోగా చైనా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే టారిఫ్స్‌ను 50శాతానికి పెంచుతామని హెచ్చరించారు. ‘టారిఫ్స్‌తో మేమూ నష్టపోతాం. కానీ ఆకాశమేం ఊడిపడదు. తుది వరకు పోరాడుతాం’ అంటూ చైనా ఘాటుగా బదులిచ్చింది. కాగా టారిఫ్స్‌పై భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
News April 8, 2025
మంచిర్యాల: గోదావరిలో దూకి వ్యక్తి సూసైడ్

గోదావరిలో దూకి వ్యక్తి సూసైడ్ చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగింది. మందమర్రికి చెందిన హషాం అహ్మద్(45) సోమవారం రాయపట్నం గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ ఉదయ్ కుమార్ తెలిపారు. అహ్మద్ కొంతకాలం నుంచి ఫైనాన్స్ విషయంపై బాధపడుతున్నాడన్నారు. మృతుడి తండ్రి మహమ్మద్ అలీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ వెల్లడించారు.
News April 8, 2025
పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్

TG: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఇవాళ్టి నుంచి జరగాల్సిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని ప్రైవేట్ డిగ్రీ కాలేజీల అసోసియేషన్ డిమాండ్ చేసింది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో తాము కాలేజీలు నడపలేకపోతున్నామని వెల్లడించింది. ఈ మేరకు ఓయూ రిజిస్ట్రార్‌కు వినతిపత్రం అందించింది. ఆస్తులు అమ్మి కాలేజీలు నడుపుతున్నామని, నాలుగేళ్లుగా బకాయిలు రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది.