News February 11, 2025
ధాన్యం కొనుగోలు పారదర్శకంగా ఉండాలి: కలెక్టర్

రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోలు పారదర్శకంగా ఉండాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. జగిత్యాల కలెక్టరేట్లో సోమవారం యాసంగి 2024-25 వరిధాన్యం కొనుగోలు సంబంధించిన సన్నద్ధతపై ఆయన సమీక్షా నిర్వహించారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకునే విధంగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ బిఎస్ లతా తదితర అధికారులున్నారు.
Similar News
News November 10, 2025
జూబ్లీహిల్స్ బైపోల్ ‘బరిలో పెద్దపల్లి యువకుడు’

పెద్దపల్లి(D) ఓదెల మండలం గూడెంకి చెందిన సిలివేరు శ్రీకాంత్ జమ్మికుంటలో స్థిరపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలబడ్డారు. ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవడం తమ బాధ్యత అని ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. కాగా, నియోజకవర్గంలో 2,08,561 మంది పురుషులు, 1,92,779 మంది మహిళలు, 25 మంది ఇతర ఓటర్లున్నారు. ఓటు హక్కుతో దేశ ప్రగతిని నిర్మించవచ్చని ప్లకార్డులతో కాలనీల్లో పర్యటించారు.
News November 10, 2025
గృహలబ్ధిదారుల వివరాలు నమోదు చేయండి: DRO

గృహాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి వివరాలను సర్వే చేసి అర్హత ఉన్న వారి వివరాలను యాప్‌లో నమోదు చేయాలని DRO శ్రీనివాసమూర్తి సోమవారం ఆదేశించారు. నవంబర్ 30 వరకు ప్రభుత్వం సర్వేకు సమయం ఇచ్చిందని, లబ్ధిదారుల సర్వే పూర్తి చేసి అప్లోడ్ చేయాలని తెలిపారు. మండల ప్రత్యేకాధికారులు సచివాలయాల తనిఖీ చేసి ప్రొఫార్మాలో వివరాలను నమోదు చేసి సమర్పించాలని సూచించారు.
News November 10, 2025
షీ టీంపై విద్యార్థులకు అవగాహన సదస్సు

ఆకతాయిల వేధింపులకు గురైతే వెంటనే షీ టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని మహిళలకు ఇన్‌స్పెక్టర్ సుజాత వరంగల్‌లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సోమవారం బాల్య వివాహాలు, సైబర్ క్రైమ్‌పై అవగాహన కల్పించారు. వేధింపులకు గురైతే మౌనంగా ఉండకుండా, డయల్ 100 లేదా 8712685142 నంబర్‌కు, లేదా టీ-సేవ్ యాప్ ద్వారా సమాచారం అందించాలని కోరారు.


