News March 20, 2025
ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలపై వనపర్తి కలెక్టర్ సూచన

రైతుల నుంచి 2024-25 రబీ సీజన్‌కు సంబంధించి వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ తన ఛాంబర్‌లో అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లుతో కలిసి రబీ సీజన్ వరి కొనుగోలుపై సమావేశం నిర్వహించారు. రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
Similar News
News December 14, 2025
తెలంగాణలో పొదిలి, మార్కాపురం వాసులు మృతి.!

ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు ఈతకు వెళ్లి ఊపిరాడక మృతి చెందిన ఘటన తెలంగాణలో జరిగింది. పొదిలికి చెందిన సాయి ప్రసాద్, మార్కాపురంకి చెందిన రవితేజ, కంభంకి చెందిన వంశీకృష్ణలు నిజామాబాద్‌లో బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే వీరు శుక్రవారం రాత్రి రామడుగు ప్రాజెక్టు వద్దకు వెళ్లి వాగులో దిగారు. ఒక్కసారిగా ఊపిరాడక ప్రసాద్, రవితేజ మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News December 14, 2025
భవానీ దీక్ష విరమణ.. నిన్నటి ఆదాయం ఎంతంటే.!

విజయవాడలో భవానీ దీక్షల విరమణ సందర్భంగా శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు. ఒక్కరోజే 1,20,789 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. లడ్డూ ప్రసాదం (రూ.15) 2,159, ఆరు లడ్డూల బాక్సులు 76,356, శ్రీ చక్రార్చన లడ్డూ 65 విక్రయించారు. 49,948 మందికి అల్పాహారం, వేలాది మందికి అన్నప్రసాదం అందజేశారు. 13,066 మంది భక్తులు కేశఖండనం చేయించుకున్నారు. ఒక్కరోజే రూ. 81,97,17 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
News December 14, 2025
మల్దకల్: పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన కలెక్టర్

రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతున్న మల్దకల్ మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలను గద్వాల కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు ఆదివారం విజిట్ చేశారు. పోలింగ్ ప్రక్రియ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే భద్రత ఏర్పాట్ల గురించి పోలీస్ సిబ్బందికి ఎస్పీ పలు సూచనలు చేశారు. నిర్దేశించిన సమయంలో పోలింగ్ పూర్తి అయ్యే విధంగా పోలింగ్ వేగవంతం చేయాలని సూచించారు.


