News November 13, 2025
ధాన్యం డబ్బులు చెల్లింపుల్లో జనగామ జిల్లా ఫస్ట్: కలెక్టర్

ఒక యాక్షన్ ప్లాన్‌తో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ధాన్యం కొనుగోలు పురోగతిపై వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ ఖరీఫ్ సీజన్‌కి సంబంధించి ధాన్యం డబ్బుల చెల్లింపులో రాష్ట్రస్థాయిలో జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు.
Similar News
News November 13, 2025
ముంబైలోకి విధ్వంసకర బ్యాటర్

IPL: వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ రూథర్‌ఫర్డ్‌ను జట్టులోకి తీసుకున్నట్లు ముంబై ఇండియన్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. రూ.2.6 కోట్లకు గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకుంది. ఇతడికి 200 టీ20 మ్యాచులు ఆడిన అనుభవం ఉంది. 3500కు పైగా రన్స్ చేశారు. భారీ సిక్సర్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించగల సత్తా రూథర్‌ఫర్డ్ సొంతం.
News November 13, 2025
కృష్ణా: విద్యార్థులకు అలర్ట్.. రేపటి SA-1 పరీక్ష వాయిదా

జిల్లా వ్యాప్తంగా రేపు జరగనున్న SA-1 (సమ్మేటివ్ అసెస్‌మెంట్-1) పరీక్షల్లో భాగంగా నవంబర్ 14న జరగాల్సిన పరీక్ష బాలల దినోత్సవం సందర్భంగా వాయిదా వేసినట్లు DEO తెలిపారు. 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు వాయిదా పడిన పరీక్ష నవంబర్ 17న, 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు నవంబర్ 20న నిర్వహించనున్నట్లు సూచించారు. రేపటి పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను సురక్షితంగా భద్రపరచాలని DEO అధికారులను ఆదేశించారు.
News November 13, 2025
అల్ ఫలాహ్ వర్సిటీకి షాక్

ఉగ్ర మూలాలు బయటపడిన ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ వర్సిటీపై అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్(AIU) చర్యలు తీసుకుంది. సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. వెంటనే లోగోను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కళాశాలకు గుర్తింపు ఉందంటూ వెబ్‌సైట్‌లో ప్రదర్శించినందుకు వర్సిటీకి న్యాక్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. యూనివర్సిటీకి ఫండింగ్, డాక్టర్ల ఆర్థిక లావాదేవీలపై ఈడీ దర్యాప్తు చేయనుంది.


