News November 11, 2025
ధాన్యం సేకరణలో అగ్రస్థానంలో నిజామాబాద్

వానాకాలం-2025 సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణలో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉందని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి వెల్లడించారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరి ధాన్యం సేకరణ, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లపై సమీక్ష జరిపారు.
Similar News
News February 21, 2026
ఆర్మూర్ మున్సిపాలిటీలో రూ.500 కోట్ల కుంభకోణం?

2014-25 మధ్య ఆర్మూర్ మున్సిపాలిటీలో జరిగిన రూ.500 కోట్ల అవినీతిపై విజిలెన్స్ విచారణకు రంగం సిద్ధమైంది. ఇటీవల కమిషనర్ రాజు ఏసీబీకి చిక్కడంతో పాత అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ ఇంటి నంబర్ల కేటాయింపుపై అధికారులు ఆరా తీస్తున్నారు. 11 ఏళ్లుగా పాతుకుపోయిన సిబ్బంది, అవుట్‌సోర్సింగ్ నియామకాల్లో వసూళ్లపై త్వరలోనే డొంక కదలనుంది.
News February 21, 2026
NZB: విద్యాశాఖలో ప్రక్షాళన.. ప్రైవేట్ స్కూల్ సెక్షన్ల మార్పు

జిల్లా విద్యాశాఖలో ఏళ్లుగా పాతుకుపోయిన సిబ్బందిపై వేటు పడనుంది. ప్రైవేట్ పాఠశాలల విభాగాల్లో ఏడాది కంటే ఎక్కువ కాలం పనిచేస్తున్న వారిని తక్షణమే మార్చాలని విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు. జిల్లాలో 9 మంది సిబ్బంది ప్రైవేట్ స్కూల్ పనులు చూస్తుండగా, ఐదుగురు మూడేళ్లుగా అక్కడే ఉండటంతో అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. దీంతో 3 రోజుల్లో సెక్షన్ల మార్పునకు అధికారులు రంగం సిద్ధం చేశారు.
News February 21, 2026
NZB: వారినే కొనసాగిస్తారా?.. కొత్త వారికి అవకాశం ఇస్తారా?

నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రకటన నేపథ్యంలో NZB జిల్లా నుంచి రాష్ట్ర ఛైర్మన్లుగా ప్రస్తుతం ఉన్న వారినే కొనసాగిస్తారా? లేక కొత్త వారికి అవకాశమిస్తారా? అన్న చర్చ జరుగుతోంది. జిల్లా నుంచి ఈరవత్రి అనిల్ కుమార్ – మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మానాల మోహన్ రెడ్డి – సహకార యూనియన్, అన్వేష్ రెడ్డి – విత్తనాభివృద్ధి సంస్థ, తాహేర్ బిన్ హమ్దాన్ – ఉర్దూ అకాడమీకి రాష్ట్ర ఛైర్మన్లుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.


