News April 9, 2025
ధూల్‌పేటలో 90% గంజాయి బంద్..!

గంజాయి సరఫరాకు కేరాఫ్ అడ్రస్ అయిన HYD ధూల్‌పేటలో 90% గంజాయి అమ్మకాలు తగ్గిపోయినట్లు ఎక్సైజ్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి తెలిపారు. ఆపరేషన్ ధూల్ పేట్లో భాగంగా 102 కేసులను నమోదు చేసి, 327 మందిని రిమాండ్‌కు పంపించారని, 13 మందిని బౌండోవర్ చేశారని, 85 మంది పరారీలో ఉన్నారన్నారు. 147 మొబైల్స్, 58 బైక్లు, 2 కార్లు స్వాధీనం చేసుకొని, 401 కేజీల గంజాయిని పట్టుకున్నారన్నారు.
Similar News
News April 18, 2025
డ్రగ్స్ స్కామ్‌లో వైద్యుడికి 130ఏళ్ల జైలు శిక్ష

$2.3 మిలియన్ల డ్రగ్స్ స్కామ్‌లో భారత సంతతి వైద్యుడికి అమెరికాలో 130 ఏళ్ల జైలు శిక్ష పడింది. పెన్సుల్వేనియాకు చెందిన ఆనంద్(48) మెడికేర్‌కు తప్పుడు పత్రాలు సమర్పించారని, పేషెంట్లకు నిషేధిత ట్యాబ్లెట్స్ ఇచ్చారన్న అభియోగాలపై విచారణ జరిపి యూఎస్ ప్రత్యేక కోర్టు శిక్ష విధించింది. 20 వేలకు పైగా ఆక్సికోడోన్ వంటి అడిక్టివ్ ట్యాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేసినట్లు రుజువైందని పేర్కొంది.
News April 17, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> పాలకుర్తిలో వైద్యుల నిర్లక్ష్యం శిశువు మృతి చిల్పూర్‌లో భూభారతిపై అవగాహన సదస్సు > కొడకండ్లలో ఇంటిగ్రేటెడ్ స్కూలు ఏర్పాటు చేస్తాం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి > జనగామ: మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా > పసికందు మృతిపై స్పందించిన కలెక్టర్ > పశ్చిమబెంగాల్ లో హిందువులపై దాడిని ఖండిస్తూ జనగామలో నిరసన > అధికారులు సమన్వయంతో పని చేయాలి: కలెక్టర్ > నర్మెట్టలో పామాయిల్ తోట దగ్ధం
News April 17, 2025
విశాఖలో టుడే టాప్ న్యూస్

➤ జనసేనలో చేరిన ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లు ➤వైసీపీకి రాజీనామా చేసిన అవంతి శ్రీనివాస్ కుమార్తె లక్ష్మీ ప్రియాంక➤కలెక్టరేట్లో దిశా మీటింగ్ నిర్వహించిన ఎంపీ భరత్ ➤ఈ నెల 24 నుంచి సింహాద్రి అప్పన్న చందనం అరగదీత ➤పలు హాస్టల్లో తనిఖీలు చేసిన మంత్రి డోలా ➤ POCSO చట్టంపై అవగాహన కల్పించిన హోంమంత్రి ➤ APR 30 వరకు పన్ను వడ్డీపై 50% రాయితీ ➤దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ప్రోగ్రాంకు అనుమతి ఇచ్చిన పోలీసులు