News November 7, 2025
ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్!

క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ వచ్చే ఐపీఎల్‌లో ఆడుతారా లేదా అనే సస్పెన్స్‌కు తెరపడింది. ఈ విషయంపై చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ క్లారిటీ ఇచ్చారు. IPL-2026లో ధోనీ ఆడుతారని వెల్లడించారు. వచ్చే సీజన్‌కు అందుబాటులో ఉంటానని ఆయన తమకు సమాచారం ఇచ్చారని తెలిపారు. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్‌ను తీసుకునే అంశంపైనా సీఎస్కే చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
Similar News
News November 7, 2025
అది పాకిస్థాన్ చరిత్రలోనే ఉంది: భారత్

అణ్వాయుధాలను <<18185605>>పరీక్షిస్తున్న<<>>దేశాల్లో పాకిస్థాన్ కూడా ఉందని US అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై భారత్ స్పందించింది. రహస్య, చట్ట విరుద్ధ అణు కార్యక్రమాలు నిర్వహించడం పాక్ చరిత్రలోనే ఉందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ విమర్శించారు. దశాబ్దాలపాటు స్మగ్లింగ్, ఎగుమతి నియంత్రణ ఉల్లంఘనలు, రహస్య భాగస్వామ్యాలు నిర్వహించిందని అన్నారు. ఈ విషయాలను ప్రపంచానికి తెలియజేస్తూనే ఉన్నామన్నారు.
News November 7, 2025
కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

TG: మాజీ మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. గాడిద ఫొటోపై ‘గాడిద నీపై అరిస్తే.. నువ్వు దానిపై అరవకు’ అని ఉన్న కొటేషన్‌ను షేర్ చేశారు. దీనికి ‘If you know, you know’ అని క్యాప్షన్ పెట్టి స్మైలింగ్ ఎమోజీని జోడించారు. ఇవాళ ప్రెస్‌మీట్‌లో తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం <<18226951>>రేవంత్‌కు<<>> పరోక్ష కౌంటర్‌గానే కేటీఆర్ ఈ ట్వీట్ చేశారని BRS వర్గాలంటున్నాయి.
News November 7, 2025
చర్చలు సఫలం.. రేపటి నుంచి కాలేజీలు రీఓపెన్

TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య చర్చలు సఫలమయ్యాయి. దీంతో రేపటి నుంచి ప్రైవేట్ కాలేజీలు తెరుచుకోనున్నాయి. రూ.900 కోట్ల నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కొన్ని రోజులుగా కాలేజీలు బంద్ పాటిస్తున్న సంగతి తెలిసిందే.


