News March 1, 2026

ధ్యానం ఎందుకు చేయాలి?

image

‘ధ్యానం’ ఆయుర్వేద అభ్యాసంగా మన భారతదేశంలో పుట్టిన ఓ గొప్ప సంప్రదాయం. నేడు మానసిక ప్రశాంతత కోసం ప్రపంచవ్యాప్తంగా దీనిని అనుసరిస్తున్నారు. ధ్యానం కేవలం ఓ ఆధ్యాత్మిక ప్రక్రియే అనుకుంటే పొరపాటే! ఇది మన శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు చేసే ఓ సంపూర్ణ ఆరోగ్య సాధనం. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. క్రమం తప్పకుండా ధ్యానం చేస్తే జీవితంలో క్రమశిక్షణ, స్పష్టత, ఏకాగ్రత పెరుగుతాయి.

Similar News

News March 1, 2026

కేసులు పరిష్కరించే మధ్యవర్తులకు రూ.10,000: CBN

image

AP: అమరావతిలో నేషనల్ జుడీషియల్ అకాడమీని నెలకొల్పాలని CM చంద్రబాబు CJIని కోరారు. ’మధ్యవర్తిత్వం‘పై జరిగిన సదస్సులో మాట్లాడుతూ ‘ఇక్కడ నిర్మించే జస్టిస్ సిటీని దేశంలోనే బెస్ట్ మోడల్‌గా తీర్చిదిద్దుతాం. మధ్యవర్తిత్వంతో కేసులను పరిష్కరిస్తే ₹10,000 ఇస్తాం. కేసులు పరిష్కారం కాకున్నా ₹3000 ఇస్తాం’ అని పేర్కొన్నారు. అంతకు ముందు జడ్జీల బంగ్లాలను CJI ప్రారంభించారు. AP జుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేశారు.

News March 1, 2026

BREAKING: US యుద్ధనౌకపై 4 మిస్సైళ్లతో ఇరాన్ దాడి

image

యుద్ధ విమానాలను తరలిస్తున్న అమెరికా నౌక అబ్రహం లింకన్‌పై ఇరాన్ దాడి చేసింది. 4 బాలిస్టిక్ మిస్సైళ్లతో అటాక్ చేసినట్లు IRGC ప్రకటించింది. అయితే యుద్ధ విమానాలకు ఏ మేరకు నష్టం జరిగిందనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. యుద్ధం నేపథ్యంలో ఇరాన్ చుట్టుపక్కల ఉన్న ఎయిర్ బేస్‌లకు వాటిని తరలిస్తుండగా ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దీనికి ప్రతిగా ఇరాన్‌పై US దాడులు మరింతగా పెంచే ఆస్కారముంది.

News March 1, 2026

సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు: రాజగోపాల్ రెడ్డి

image

TG: సీఎం రేవంత్‌‌పై ఓ వైపు ప్రశంసలు కురిపిస్తూనే మరోవైపు తనదైన శైలిలో మునుగోడు MLA రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ‘మునుగోడుకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసినందుకు CMకు ధన్యవాదాలు. విద్యావ్యవస్థలో మార్పులు తెస్తున్నారు. గత ప్రభుత్వం విద్యను గాలికి వదిలేసింది’ అని అన్నారు. మరోవైపు హైదరాబాద్‌కు పక్కనే ఉన్న మునుగోడును పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అభివృద్ధిలో ఇంకా వెనుకబడి ఉందని పేర్కొన్నారు.