News October 23, 2025
నంగునూర్: కొనుగోలు కేంద్రాలపై కోతుల దండయాత్ర

నంగునూర్ మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలపై కోతులు గుంపుగా దండెత్తుతున్నాయి. వడ్ల రాశులపై కోతుల గుంపులు దండెత్తి ధాన్యాన్ని తినివేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కోతులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన రైతులపై దాడి చేస్తుండటంతో మహిళలు, చిన్నారులు భయపడుతున్నారు. కోతుల బెడద నుంచి కాపాడాలని, మార్కెట్ సిబ్బంది తక్షణమే చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Similar News
News October 23, 2025
కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతల వివరాలు

కామారెడ్డి జిల్లాలో రాత్రిపూట చలి తీవ్రత ప్రభావం క్రమంగా పెరుగుతోంది. బిచ్కుంద మండలంలో 33.8 సెంటీగ్రేడ్ కాగా.. మద్నూర్ మండలంలో 33.6, పాల్వంచ 33,5, నస్రుల్లాబాద్ 33, బీర్కూర్ 32.8, అత్యల్పంగా రాజంపేట మండలంలో 30.8 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రత పెరుగుతున్నందున వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
News October 23, 2025
జూరాలకు 15,241 క్యూసెక్కుల వరద

గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గింది. గురువారం ఉదయం ఇన్ ఫ్లో 15,241 క్యూసెక్కులు వస్తుంది. ప్రాజెక్టు అన్ని గేట్లు మూసివేశారు. పవర్ హౌస్‌కు 17,176 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అలాగే కుడి కాలువకు 700 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 1,030 క్యూసెక్కులు, సమాంతర కాలువకు 46, బీమా లిఫ్ట్ -2 కు 783, మొత్తం 18,999 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
News October 23, 2025
మహమ్మదాబాద్‌లో అత్యధిక వర్షపాతం

మహబూబ్‌నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో మహమ్మదాబాద్ మండలంలో 13.8 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. హన్వాడ 13.7, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 4.8, గండీడ్ మండలం సర్కార్ పేట, దేవరకద్ర 3.8 , మహబూబ్‌నగర్ గ్రామీణం, భూత్పూర్ 3.3, జడ్చర్ల 3.0, నవాబుపేట మండలం కొల్లూరు 2.5, బాలానగర్ 2.0 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది.