News April 6, 2025
నంచర్ల-గుంతకల్లు మధ్య రైల్వే డబుల్ లైన్

అనంత జిల్లా గుంతకల్లు రైల్వే జంక్షన్ మల్లప్పగేట్ నుంచి కర్నూలు నంచర్ల మధ్య డబుల్ లైన్ నిర్మాణానికి రైల్వే శాఖ అడుగులు పడ్డాయి. గుంతకల్లు రైల్వే జంక్షన్ మల్లప్పగేట్ నుంచి KNL చిప్పగిరి, దౌలతాపురం, నంచర్ల మధ్య ఈ ఆర్‌వో డబుల్ లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకోసం రైతుల నుంచి భూసేకరణ చేయనున్నారు. పత్తికొండ ఆర్టీవో పర్యవేక్షణలో భూసేకరణ చేపడుతున్నట్లు రైల్వే అధికారులు నోటీసులో పేర్కొన్నారు.
Similar News
News April 7, 2025
ADB: వారంలో 8 సైబర్ మోసాలు: SP

ఆదిలాబాద్ జిల్లా ప్రజలు సైబర్ క్రైమ్, ఆన్‌లైన్ ఫ్రాడ్, మొబైల్ హ్యాకింగ్ లాంటి సైబర్ నేరాలకు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. గత వారంలో జిల్లాలో 8 సైబర్ ఫిర్యాదులు స్వీకరించామన్నారు. ఎటువంటి గుర్తు తెలియని స్కాం నంబర్లు, లింక్లు ఓపెన్ చేయొద్దన్నారు. సైబర్ క్రైమ్‌కు గురైతే 1930కు కాల్ చేయాలని పేర్కొన్నారు.
News April 7, 2025
జనగామ: రాముడి ఆస్తి ఎక్కడ?.. వెలిసిన ఫ్లెక్సీ

స్టేషన్ ఘనపూర్ మండలంలోని తాటికొండ గ్రామంలో ఆదివారం రాములవారి కళ్యాణం ఘనంగా జరగగా.. రాముడి ఆస్తి ఎక్కడ? అంటూ ఆలయ ఆవరణలో స్థానికుడైన శ్రీనివాస్ అనే వ్యక్తి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాడు. గ్రామంలో దేవుడి పేరుపై 86.35 ఎకరాల భూమి ఉండగా.. సుమారు పదిమంది వ్యక్తులు 50 ఎకరాల వరకు భూమిని పట్టా చేయించుకున్నట్లు తెలిసిందన్నారు. రాముని ఆస్తి తిరిగి వస్తుందనే ఆశతో ఫ్లెక్సీని ఏర్పాటు చేశానన్నాడు.
News April 7, 2025
పెద్దకొత్తపల్లి: అకాల వర్షానికి నేల రాలిన మామిడికాయలు

పెద్దకొత్తపల్లి మండలంలో ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి పలుచోట్ల మామిడికాయలు రాలిపోయినట్లు రైతులు తెలిపారు. అరగంటకు పైగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో పలు గ్రామాలలో మామిడికాయలు రాలిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. అకాల వర్షానికి మామిడికాయలు రాలిపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరారు.