News March 21, 2025
నందనవనంగా అమరావతిని మార్చుకుందాం

AP రాజధానిగా అమరావతి రూపుదిద్దుకుంటోంది. దాదాపు 30 వేల ఎకరాల్లో భారీ ప్రాజెక్టుల సమాహారం ఇది. అయితే మహానగరంగా ఎదిగే ఏ ప్రాంతమైనా ఎదుర్కొనే ప్రధాన సమస్య పర్యావరణం. అందుకు ప్రభుత్వమే కాదు మనమూ నైతిక బాధ్యత వహించాలి. ప్రకృతితో స్నేహం చేస్తూ ఇంటికో చెట్టు పెంచాలి. ప్రకృతి ఒడిలో ఓలలాడేలా, పచ్చదనం విరబూసే నందనవనంలా అమరావతిని అలంకరించాలి. మీరేమంటారు.
నేడు ప్రపంచ అటవీ దినోత్సవం.
Similar News
News January 3, 2026
అన్నమయ్య జిల్లాలో 92 ఉద్యోగాలకు నోటిఫికేషన్

అన్నమయ్య జిల్లాలో 92 ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. టైప్-3 కస్తూర్బాగాందీ విద్యాలయాల్లో(KGVB) 56, టైప్-4 కేజీబీవీల్లో 36 నాన్ టీచింగ్ పోస్టింగ్‌లను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఇవాళ్టి నుంచి జనవరి 11వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అప్లికేషన్లు జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.
News January 3, 2026
NZB: విద్యతో మహిళలకు విముక్తి దీపం: TPCC అధ్యక్షుడు

విద్యతో మహిళలకు విముక్తి దీపం వెలిగించిన మహనీయురాలు సావిత్రి బాయి ఫూలే అని TPCC అధ్యక్షుడు, MLC మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. సావిత్రిబాయి ఫూలే 195వ జయంతి సందర్భంగా ఆ మహనీయురాలికి నివాళి అర్పించారు. మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. భారతదేశ సామాజిక చరిత్రలో ఆమె చేసిన విప్లవాత్మక పోరాటాన్ని స్మరించుకోవడం ప్రతి పౌరుని కర్తవ్యమన్నారు. ఆమె సాగించిన పోరాటం తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు.
News January 3, 2026
అప్పుడు రూ.1,000.. ఇప్పుడు రూ.22,000

AP: 2 నెలల క్రితం టన్ను అరటి ధర రూ.1,000కి పడిపోవడంతో కన్నీరుపెట్టిన రైతన్న ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నాడు. ఉమ్మడి అనంతపురంలో ధరలు అమాంతం పెరిగాయి. ప్రస్తుతం మొదటి కోత టన్ను రూ.22 వేలకు చేరింది. ఎగుమతులు పెరగడం, వాతావరణం అనుకూలించడంతో డిమాండ్ పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో సంక్రాంతి వేళ రైతుల మోముల్లో నవ్వులు పూస్తున్నాయి. అనంతపురం, సత్యసాయి, కడప జిల్లాల్లో అరటి పెద్దసంఖ్యలో సాగైంది.


