News April 16, 2024
నందలూరు: సివిల్స్‌లో మెరిసిన కృష్ణ శ్రీవాత్సవ్ యాదవ్

నందలూరు మండలానికి చెందిన గొబ్బిళ్ళ కృష్ణ శ్రీవాత్సవ్ ప్రతిష్ఠాత్మక సివిల్ సర్వీసెస్ పరీక్షలో 444 ర్యాంక్ సాధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణ శ్రీవాత్సవ్ సోదరి విద్యాధరి కందుకూరు సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఒకే ఇంట్లో అక్క ఉద్యోగం, తమ్ముడు సివిల్స్‌లో మంచి ర్యాంక్ సాధించడం పట్ల గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.
Similar News
News January 6, 2026
కడప జిల్లాలో ఉల్లి రైతులకు రూ.28.40 కోట్ల సాయం.!

కడప జిల్లాలో 7298 మంది ఉల్లి రైతులకు 14,203.31 ఎకరాలకు రూ.28.40 కోట్లు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం విడుదల చేసింది.
*కమలాపురం 2526 మందికి రూ.11.32 కోట్లు
*మైదుకూరు 2352 మందికి రూ.7.74 కోట్లు
*పులివెందుల 1590 మందికి రూ.6.17 కోట్లు
*జమ్మలమడుగు 742 మందికి రూ.2.99 కోట్లు
*బద్వేల్ 67మందికి రూ.14.92 లక్షలు
*రాజంపేట 18మందికి రూ.2.33 లక్షలు
*కడప ఇద్దరికి రూ.35,900
*ప్రొద్దుటూరులో ఒకరికి రూ.20.60 వేలు.
News January 6, 2026
2వ సెట్‌ను కూడా కైవసం చేసుకున్న ఏపీ టీం

ఇవాళ జాతీయ స్థాయి U-14 బాలికల వాలీబాల్ లీగ్ మ్యాచ్‌లో ఏపీ టీం ఒడిశా టీంతో పోటీ పడుతోంది. రెండో సెట్లోనూ ఏపీ టీం విజయం సాధించింది. <<18778904>>మొదటి<<>> సెట్లోనే విజయం సాధించడంతో 2-0 తో ముందంజలో ఉంది. <<18777301>>LIVE<<>> ను కూడా మీరు Way2News లో చూడవచ్చు.
News January 6, 2026
జమ్మలమడుగు: సెట్ 1 కైవసం చేసుకున్న ఏపీ టీం

ఇవాళ జాతీయ స్థాయి U-14 బాలికల వాలీబాల్ లీగ్ మ్యాచ్‌లో ఏపీ టీం ఒడిశా టీంతో పోటీ పడుతోంది. మొదటి సెట్లో ఏపీ విజయం సాధించింది. ప్రస్తుతం రెండో సెట్ జరుగుతోంది. రెండో సెట్‌లోనూ భారీ వ్యత్యాసంతో ఏపీ టీం దూసుకుపోతోంది. మొత్తం 5 సెట్లు జరుగుతాయి. <<18777301>>LIVE<<>> ను కూడా మీరు Way2News లో చూడవచ్చు.


