News February 1, 2025
నందికొట్కూరులో రాష్ట్రపతి అవార్డు గ్రహీత మృతి
నందికొట్కూరుకు చెందిన రిటైర్డ్ టీచర్, రాష్ట్రపతి అవార్డు గ్రహీత ఇందిరాబాయి (90) శనివారం ఉదయం మరణించారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతిపై స్థానిక ఉపాధ్యాయులు, విద్యార్థులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 1993లో ఆమె ఉత్తమ ఉపాధ్యాయులిగా రాష్ట్రపతి అవార్డును అందుకున్నారు.
Similar News
News February 1, 2025
ఫుట్‌వేర్ సెక్టార్‌కు కొత్త స్కీమ్.. 22 లక్షల మందికి ఉపాధి
ఫుట్‌వేర్, లెదర్ సెక్టార్‌లో ఉత్పత్తి, నాణ్యతను మెరుగుపరించేందుకు ప్రత్యేక పాలసీని తీసుకురానున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. నాణ్యమైన లెదర్, నాన్ లెదర్ పాద రక్షల ఉత్పత్తి, డిజైన్, యంత్రాలకు మద్దతునివ్వడానికి ఈ స్కీమ్ ఉపయోగపడుతుందని తెలిపారు. కొత్తగా 22 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. రూ.1.1 లక్షల కోట్ల ఎగుమతులు సాధిస్తుందని చెప్పారు.
News February 1, 2025
BUDGET: మెడిసిన్ ఆశావహులకు స్వీట్ న్యూస్
మెడిసిన్ చదవాలనుకుంటున్న వారికి నిర్మలా సీతారామన్ ఒక స్వీట్ న్యూస్ చెప్పారు. రాబోయే ఐదేళ్లలో మెడికల్ సీట్లను మరో 75000 పెంచుతామని తెలిపారు. 2025-26లో 200 క్యాన్సర్ సెంటర్లను నెలకొల్పుతామని పేర్కొన్నారు. ఇక యువత కోసం దేశవ్యాప్తంగా 5 స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఆరంభిస్తామన్నారు. రూ.500 కోట్లతో విద్యలో AI ఎక్సలెన్సీ సెంటర్ పెడతామన్నారు.
News February 1, 2025
BUDGET 2025-26: ముఖ్యాంశాలు
*గిగ్ వర్కర్లకు ఐడీ కార్డులు.. ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు
*అన్ని ప్రభుత్వ పాఠశాలలకు బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం
*MSMEలకు రూ.10వేల కోట్లతో ఫండ్
*నమోదు చేసుకున్న సూక్ష్మ సంస్థలకు తొలి ఏడాది రూ.10 లక్షల వరకు క్రెడిట్ కార్డులు
*నగరాల అభివృద్ధి కోసం అర్బన్ ఛాలెంజ్ బోర్డు
*సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు అదనపు నిధులు
*ప్రతి జిల్లాలో క్యాన్సర్ ఆస్పత్రులు