News February 26, 2025
నందిగం: ఉపాధ్యాయుడిపై కేసు నమోదు.. అరెస్ట్

నందిగం మండలం దేవుపురం ప్రాథమికోన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న కొండాల గోపాలం అనే ఉపాధ్యాయుడిపై ఇటీవల నందిగం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం విదితమే. ఈ మేరకు మంగళవారం ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేసి టెక్కలి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్ఐ మహమ్మద్ ఆలీ తెలిపారు. పాఠశాల విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కారణంగా ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
Similar News
News February 26, 2025
నందిగాం : కంటతడి పెట్టించిన మూగ జీవి ఆవేదన!

నందిగాం మండలం హరిదాసుపురం గ్రామంలో దృశ్యం చూపరులను కంటతడి పెట్టించింది. ఓ కుక్క పిల్లను గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. అయితే స్థానికులు నీరు పోసి బ్రతికించే ప్రయత్నం చేసినా ఫలితం లేక పోయింది. కాసేపటికి అక్కడకు చేరుకున్న తల్లి కుక్క రోధించిన తీరు గుండెల్ని పిండేసేలా చేసింది.
News February 26, 2025
సోంపేట: ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య

సోంపేట మండలం బారువాకొత్తూరు గ్రామంలో యువతి ఆత్మహత్య విషాదాన్ని నింపింది. బట్టిగళ్ళురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న గ్రామానికి చెందిన వాలిశెట్టి తులసి మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఎస్ఐ హరిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 26, 2025
SKLM: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం

జిల్లాలో ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం తెలిపారు. మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీకాకుళంలో 31 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. ఓటర్లుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. వారందరికీ ఓటర్ స్లిప్పులను కూడా పంపిణీ చేయడమైనదన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.